Galentine's Day: వాలెంటైన్స్ డే సరే.. మరి ఏంటీ గాలెంటైన్స్ డే!
ABN, First Publish Date - 2023-02-14T21:07:04+05:30
వాలెంటైన్స్ డే(Valentine's Day).. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు
హైదరాబాద్: వాలెంటైన్స్ డే(Valentine's Day).. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలోని ప్రేమికులందరికీ మర్చిపోని, మర్చిపోలేని రోజు ఇది. ప్రేమికుల దినోత్సవంగా చెప్పుకునే ప్రేమికుల పండుగ రోజు అది. సరే.. మరి గాలెంటైన్స్ డే(Galentine's Day) అంటే?.. ఈ పేరేదో కొత్తగా వినిపిస్తోంది కదూ! మరీ కొత్తదేమీ కాదు కానీ, ఇది వెలుగులోకి వచ్చి ఓ పదేళ్లు అవుతోంది. మనకి మాత్రం ఇప్పుడిప్పుడే ఇది పరిచయం అవుతోంది. ఇప్పుడు ఇది కూడా కేలెండర్‌లో గుర్తు పెట్టుకోవాల్సిన రోజుగా మారింది. వాలెంటైన్స్ డేకు ముందు రోజు అంటే.. ఫిబ్రవరి 13న గాలెంటైన్స్ డేను జరుపుకుంటారు. వాలెంటైన్స్ డే ఫ్రెండ్స్ గివింగ్ వెర్షన్‌గా దీనిని చెప్పుకోవచ్చు. మహిళలు తమ బెస్ట్ ఫ్రెండ్స్(BBFs) తో జరుపుకుంటారు.
గాలెంటైన్స్ డేను ఎవరు కనిపెట్టారు?
గ్యాలెంటైన్స్ డేను లెస్లీ నోప్ (Leslie Knope) కనుగొన్నారు. పార్క్స్ అండ్ రిక్రియేషన్ అనే టీవీ షోలో ఇదొక కేరెక్టర్. నటి అమీ పోహ్లర్ (Amy Poehler)పోషించారు. 2009 నుంచి 2015 వరకు సిట్‌కామ్ దీనిని ప్రసారం చేసింది. లెస్లీ మాటల్లో చెప్పాలంటే గాలెంటైన్స్ డే అనేది సంవత్సరంలో అత్యుత్తమ రోజు. ఫిబ్రవరి 13న జరుపుకునే ఈ రోజును తాను తన స్నేహితురాళ్లతో సెలబ్రేట్ చేసుకుంటానని పేర్కొన్నారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే అనేది ప్రేమికులకు సంబంధించినది. అంతకుముందు రోజు జరుపుకునే గాలెంటైన్స్ డేను పూర్తిగా మహిళలు తమ స్నేహితురాళ్లతో జరుపుకుంటారు.
కత్రినాకైఫ్ గాలెంటైన్స్ డే
బాలీవుడ్ నటి కత్రినా కైఫ్(Katrina Kaif).. డైరెక్టర్ కరిష్మా కోహ్లీ(Karishma Kohli), టెలివిజన్ హోస్ట్ మినీ మాథుర్( Mini Mathur) గాలెంటైన్స్ డేను జరుపుకున్నారు. గాలెంటైన్స్ డేకు తాను బెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్‌ను ఆహ్వానించినా దురదృష్టవశాత్తు వారెవరు అందుబాటులో లేరని కత్రినా అన్నారు. అయితే, కరిష్మా కోహ్లీ, మినీ మాథుర్ వచ్చారని, వారితో రోజంతా సంతోషంగా గడిచిపోయిందని చెప్పుకొచ్చారు.
Updated Date - 2023-02-14T21:07:06+05:30 IST