ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Quake survivors: భూకంపం వచ్చిన కాసేపటికే తమ అపార్ట్‌మెంట్‌లో వెళ్లిన తల్లికొడుకులు..ఆ తరువాత..

ABN, First Publish Date - 2023-02-12T19:24:43+05:30

శిథిలాల కింద చిక్కుకున్న యువకుడిని కాపాడిన వాట్సాప్ స్టేటస్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: భూకంపంతో(Earthquake) అతలాకుతలమైన తుర్కియేలో(టర్కీ-Turkey) పలు ఆశ్చర్యకర ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల సహాయక సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న బోరాన్ కుబాత్ అనే యువకుడితో పాటూ అతడి తల్లి, మరో బంధవును సురక్షితంగా వెలికితీశారు. యువకుడి వాట్సాప్ స్టేటస్ ఆధారంగా అతడు ఎక్కడున్నదీ గుర్తించి కాపాడారు.

తొలిసారి అక్కడ భూకంపం సంభవించినప్పుడు యువకుడి కుటుంబం తప్పించుకోగలిగారు. ఆ తరువాత తల్లి, కొడుకు, వారి బంధువు మళ్లీ తమ అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లినప్పుడు మరోమారు భూమి తీవ్ర స్థాయిలో కంపించింది. దీంతో వారి అపార్ట్‌మెంట్ కుప్పకూలిపోవడంతో అందరూ శిథిలాల కింద చిక్కుకుపోయారు.

ఈ క్రమంలో కుబాట్ వెంటనే వాట్సాప్‌లో తన స్టేటస్(Whatsapp status) మార్చాడు. ‘‘ఈ వీడియో చూసిన వాళ్లెవరైనా మాకు సాయం చేయండి.. మమ్మల్ని కాపాడండి’’ అంటూ చిన్న వీడియో చేసి వాట్సాప్ స్టేటస్‌గా పెట్టాడు. ఆ తరువాత..తన లొకేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలన్నీ ఇచ్చాడు. దీంతో.. సహాయక సిబ్బంది పని సులువైపోయింది(Earthquake Surviror). ‘‘అప్పటికి నా ఫోన్ నా వద్దే ఉంది. దీంతో.. సోషల్ మీడియాలో నా స్టేటస్ షేర్ చేస్తే స్నేహితులెవరైనా చూస్తారని అనిపించింది. తద్వారా మమ్మల్ని కాపాడేందుకు ఎవరో ఒకరు వస్తారని భావించాను. దీంతో.. వెంటనే వాట్సాప్‌లో స్టేటస్ మార్చాను.’’ అని అతడు చెప్పుకొచ్చాడు. అయితే.. యువకుడి బంధువు కొందరు ఇప్పటికీ శిథిలాల కింద చిక్కుకుపోయి ఉన్నారు. దీంతో.. వారి క్షేమసమాచారం కోసం అతడు వేయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నాడు.

మరో ఘటనలో..సహాయక సిబ్బంది ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ వీడియో ద్వారా యూట్యూబర్‌ను రక్షించారు. హతాయ్ ప్రాంతంలో శిథిలాల కింద చిక్కుకుపోయిన ఆ యూట్యూబర్ తన పరిస్థితిని వివరిస్తూ ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేశారు. అందులో తన అడ్రస్ కూడా పేర్కొన్నారు. దీంతో.. సిబ్బంది యూట్యూబర్‌ను రక్షించగలిగారు. తాజాగా రెండు నెలల చిన్నారిని సిబ్బంది రక్షించిన విషయం తెలిసిందే. భూకంపం సంభవించిన 128 గంటల తరువాత సజీవంగా ఉన్న ఆ బాలికను చూసి స్థానికులు కేరింతలు కొట్టారు.

Updated Date - 2023-02-12T21:12:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising