ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

White hair: కొబ్బరి నూనెలో ఈ రెండిటినీ కలపి రాసుకోండి చాలు.. తెల్లజుట్టు నల్లగా మారిపోవడం ఖాయం..!

ABN, First Publish Date - 2023-04-10T15:48:21+05:30

కేవలం రెండే రెండు పదార్థాలు కొబ్బరినూనె(coconut oil)తో కలిపి ఉపయోగించడం వల్ల జుట్టు తుమ్మెద రెక్కల్లా నల్లగా మారిపోతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తెల్లజుట్టు(white hair) అనగానే అప్పుడే తాతవు, బామ్మవు అయిపోయావా అని సెటైర్లు వేస్తారు చాలామంది. వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధించే సమస్య ఇదే.. తెల్లజుట్టును కప్పిపెట్టడానికి హెయిర్ డైలు(hair dye), హెన్నాలు(Henna) వాడుతుంటారు. హెయిర్ డైలలో ఉన్న రసాయనాలు(chemicals) జుట్టును నిర్జీవం చేస్తాయి. హెన్నా అయితే పెట్టుకున్న కొన్నిరోజుల్లోపే రంగు వెలసిపోయి తెల్లజుట్టు బయటపడుతుంది. పదే పదే ఈ ప్రాసెస్ చెయ్యాలంటే చాలామందికి చిరాకు వస్తుంది. ఈ గోల ఏదీ లేకుండా జుట్టు పూర్తీ నలుపురంగులోకి మారిపోతే ఎంత బాగుంటుందో కదా.. అందుకోసమే ఈ చిట్కాలు. కేవలం రెండే రెండు పదార్థాలు కొబ్బరినూనె(coconut oil)తో కలిపి ఉపయోగించడం వల్ల జుట్టు తుమ్మెద రెక్కల్లా నల్లగా మారిపోతుంది. కొబ్బరి నూనెతో కలిసి తెల్లజుట్టు మీద మ్యాజిక్ చేసే ఆ అద్బుతమైన పదార్థాలు ఏంటంటే..

రోజ్ మేరీ..(Rosemary)

జుట్టు ఆరోగ్యంగా, నల్లగా, ఒత్తుగా పెరగడంలో రోజ్మేరీ చాలాబాగా పనిచేస్తుంది. సాధారణ కొబ్బరినూనెలో కొన్ని చుక్కల రోజ్మేరీ ఎస్సెంటియల్ ఆయిల్(rosemary essential oil) కలిపి దాన్ని జుట్టుకు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఎండిన రోజ్మేరీ ఆకులను కొబ్బరినూనెలో వేసి, మరీ ఎక్కువగా కాకుండా నూనెను కాస్త వెచ్చజేయాలి. ఈ నూనెను తలకు అప్లై చేసి రెండు నుండి మూడు గంటల ఉంచుకుని ఆ తరువాత గాఢత లేని షాంపూతో తలస్నానం చెయ్యాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే తొందరగా జుట్టు నలుపురంగులోకి మారుతుంది. జుట్టు మందంగా ఒత్తుగా పెరుగుతుంది.

Viral Video: డ్రైవరన్నా.. నీ తెలివికి హ్యాట్సాఫ్.. డ్రైవింగ్ సీట్లో కూర్చుని కదలకుండానే దొంగను ఎలా ఇరికించాడో మీరే చూడండి..!


ఉసిరికాయ..(gooseberry)

తెల్లజుట్టు నివారణకు కొబ్బరినూనెతో ఉపయోగించాల్సిన మరొక పదార్థం ఉసిరికాయ. ఉసిరికాయలు సహజంగా చర్మానికి, జుట్టుకు(skin and hair) అద్భుత ప్రయోజనాలు చేకూరుస్తాయి. కొబ్బరినూనెలో ఉసిరిపొడిని వేసి పేస్ట్ లాగా మిక్స్ చెయ్యాలి. ఈ పేస్టును జుట్టుకు అప్లై చెయ్యాలి. ముఖ్యంగా జుట్టు కుదుళ్ళకు బాగా పట్టించాలి. ఓ రెండు గంటలాగి తల స్నానం చెయ్యాలి. ఈ రెండు చిట్కాలలో ఏదో ఒకటి ఫాలో అయినా సరిపోతుంది. క్రమం తప్పకుండా ఇవి ఫాలో అయితే తెల్లబడిన జుట్టు తప్పకుండా నలుపు రంగులోకి మారుతుంది.

Wife: భర్తకు తెలియకుండా ఆన్‌లైన్‌లో ఓ వ్యక్తితో స్నేహం.. గంటల కొద్దీ చాటింగ్.. అతడిని అతిగా నమ్మిన ఆ భార్య పరిస్థితి ఇప్పుడేంటంటే..


Tirumala: తిరుమల వెళ్లాలనుకుంటున్నారా.. అయితే అక్కడ ఉన్న పరిస్థితి చూస్తే..!

Updated Date - 2023-04-11T06:28:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising