ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

White Hair: 30 ఏళ్లు రాకుండానే తెల్లజుట్టా..? మెడిసిన్స్.. క్రీములు అక్కర్లేదండోయ్.. దీన్ని బొడ్డులో పోసి మర్దన చేసుకుంటే..!

ABN, First Publish Date - 2023-10-31T14:05:39+05:30

తెల్లజుట్టు శాశ్వతంగా నల్లబడటానికి అదిరిపోయే పరిష్కారం ఉంది. ప్రతిరోజూ రాత్రి పడుకునేముందు బొడ్డులో ఇవి వేస్తే చాలు..

ఎంతవయసైనా సరే జుట్టు నల్లగా ఉంటే ఎక్కడ లేని ఉత్సాహం ఉంటుంది. తాము ఇంకా యూత్ అనే ఫీల్ లో ఉంటారు అలాంటి వారు. కానీ వయసైపోయిన వారి వరకు ఎందుకు? నిండా 30ఏళ్ళు కూడా లేనివారికి తెల్లజుట్టు మిలమిలా మెరుస్తూ కనిపిస్తుంది. ఈ తెల్లజుట్టు కవర్ చేయడానికి కొందరు హెయిర్ డై లు వాడితే మరికొందరు హెన్నా ఉపయోగిస్తారు. వీటివల్ల టెంపరరీగా తెల్లజుట్టు కవర్ అవుతుంది కానీ ఆ తరువాత కొన్ని రోజుల్లోపే మళ్లీ మామూలైపోతుంది. అలా కాకుండా తెల్లజుట్టు శాశ్వతంగా నల్లబడటానికి అదిరిపోయే పరిష్కారం ఉంది. ప్రతిరోజూ రాత్రి పడుకునేముందు కింద చెప్పుకున్న నూనెలో ఏదో ఒకటి బొడ్డులో వేసి మర్దనా చేసుకుంటూ ఉంటే కేవలం 7రోజుల్లోనే జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది. ఈ మ్యాజిక్ చిట్కా గురించి పూర్తీగా తెలుసుకుంటే..

కొబ్బరి నూనె..(Coconut oil)

కొబ్బరినూనె జుట్టుకు తేమను అందిస్తుంది. జుట్టు పొడిబారకుండా కాపాడుతుంది. కొబ్బరినూనెను ఆరోగ్యకరమైన పద్దతిలో వాడితే జుట్టు నల్లగా, ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. అయితే లోపలినుండి జుట్టు ఆరోగ్యంగా రావడానికి, జుట్టుకు జీవం అందడానికి ప్రతిరోజూ రాత్రి పడుకునేముందు కొన్నిచుక్కల కొబ్బరినూనెను బొడ్డులో వేసి మర్థనా చేయాలి. ఇలా చేస్తే జుట్టు నల్లగా మారుతుంది.

Health Facts: కళ్లజోడు వాడుతున్న ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయమిది.. రోజూ 10 నిమిషాలు ఇలా చేస్తే..!



గంధపునూనె..(sandal wood oil)

దీన్నే శాండల్ ఉడ్ ఆయిల్ అనికూడా అంటారు. ఈ నూనె జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలను తొలగిస్తుంది. తెల్లజుట్టుతో ఇబ్బంది పడుతున్నవారు రాత్రి సమయంలో కొన్ని చుక్కల గంధపు నూనెను బొడ్డులో వేసి మర్దనా చేసుకోవాలి. ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

ఆవనూనె..(mustard oil)

ఆవనూనె వినియోగం ప్రాచీనకాలం నుండే ఉంది. ఈ నూనె చలికాలంలో చాలా మంచి ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఇది జుట్టు పెరుగుదలకు కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఆవాల నూనెను ప్రతిరోజూ రాత్రి పడుకునేముందు బొడ్డులో వేసి మర్దనా చేసుకుంటూ ఉంటే తెల్లజుట్టు నల్లగా తుమ్మెద రెక్కల్లా మారుతుంది.

బాదం నూనె..(Almond oil)

బాదం నూనెను సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. చర్మసంరక్షణలో దీన్ని విరివిగా వాడతారు. బాదం నూనెలో విటమిన్-ఇ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. తెల్లజుట్టును నల్లగా మారుస్తుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునేముందు బాదం నూనెను కొన్ని చుక్కలు బొడ్డు లో వేసి మర్థనా చేసుకోవాలి. ఇలా చేస్తే కొన్ని రోజులలో జుట్టులో మార్పులు చూసి ఆశ్చర్యపోతారు.

Hair Health: తలదువ్విన ప్రతీసారి ఇంతింత జుట్టు రాలుతోందా..? కొబ్బరి నూనెనే వాడండి కానీ..!


Updated Date - 2023-10-31T14:05:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising