White Hair: ఎంత ప్రయత్నించినా తెల్ల జుట్టు నల్లగా మారిపోవడం లేదా..? ఒక్కసారి ఈ పొడిని ట్రై చేయండి.. 30 రోజుల్లో..!
ABN, First Publish Date - 2023-11-04T11:43:33+05:30
సహజంగా జుట్టు శాశ్వతంగా నల్లగా మారడానికి ఈ పొడిని ఉపయోగిస్తే చాలు.. 30రోజుల్లోపే తెల్లజుట్టు కాస్తా నల్లగా మారుతుంది.
రోజురోజుకూ తెల్ల జుట్టు అనేది క్లిష్టమైన సమస్యగా మారిపోతోంది. చాలా చిన్న వయసులోనే తెల్లజుట్టు రావడం వల్ల చాలా మంది యువత చెప్పలేనంత ఇబ్బంది పడుతున్నారు. తెల్లజుట్టు కవర్ చేయడం కోసం మంచిది కాదని తెలిసినా రసాయనాలున్న షాంపూలు, హెయిర్ డైలు వాడుతున్నారు. దీనివల్ల జుట్టు తాత్కాలికంగా నల్లబడుతుందేమో కానీ జుట్టు మూలాలు బలహీన పడటం, మెదడు కణాలు, మెదడు లోపలి నరాలు తీవ్ర నష్టానికి గురికావడం జరుగుతాయి. ఇవేవీ అవసరం లేకుండా చాలా సహజంగా జుట్టు శాశ్వతంగా నల్లగా మారడానికి కింద చెప్పుకున్న పొడిని వాడితే కేవలం 30రోజుల్లోనే తెల్లజుట్టు మాయమవుతుంది(white hair reduce tips). జుట్టు మూలాల నుండి నల్లగా మారుతుంది. దీని గురించి కొంచెం వివరంగా తెలుసుకుంటే..
తెల్లజుట్టును నల్లగా చేసే చిట్కాలు చాలానే ఉన్నాయి. అయితే అశ్వగంధతో జుట్టు నల్లగా మార్చుకోవచ్చనే విషయం బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. అశ్వగంధను ఆయుర్వేదంలో గొప్ప ఔషదంగా పరిగణిస్తారు కానీ దీన్ని జుట్టు నల్లబరచడానికి కూడా ఉపయోగించవచ్చు.
Read also: Health Secret: 100 ఏళ్ల పాటు హ్యాపీగా బతకాలనుందా..? అయితే ఈ 3 అలవాట్లను వెంటనే మానేయండి..!
రెండు స్పూన్ల అశ్వగంధ(Ashwagandha) పొడిలో తగినంత వేడినీటిని జోడించి పేస్ట్ లాగా తయారుచేసుకోవాలి. జుట్టును పాయలుగా విడదీస్తూ జుట్టు మాడు నుండి చివరి అంచుల వరకు పూర్తీగా పట్టించాలి. అరగంట పాటు దీన్ని అలాగే ఉంచి అరగంట తరువాత గాఢత లేని షాంపూతో తలస్నానం చేయాలి. అశ్వగంధ జుట్టును నల్లబరచడానికి కారణం దీంట్లో ఉండే అమైనో ఆమ్లం. అశ్వగంధలో టైరోసిన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది మెలనిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. మెలనిన్ జుట్టును నల్లగా ఉంచే వర్ణద్రవ్యం. ఆశ్వగంధ మెలనిన్(Melanin) ఉత్పత్తిని ప్రేరేపించడం ద్వారా జుట్టును నల్లగా మారుస్తుంది. ఈ ప్యాక్ ను వారంలో రెండు సార్లు ఉపయోగిస్తుంటే నెలరోజుల్లోనే ఫలితం స్పష్టంగా కనిపిస్తుంది.
జుట్టును నల్లబరచడానికి, ఒత్తుగా పెరగడానికి చాలామంది కరివేపాకును ఉపయోగిస్తారు. కరివేపాకు నూనెను తయారుచేసుకుని వాడతారు. కానీ కరివేపాకు హెయిర్ మాస్క్ కూడా జుట్టు నల్లగా మారడానికి సహకరిస్తుంది.
కరివేపాకును(curry leaves) మెత్తగా రుబ్బి పేస్ట్ చేసుకోవాలి. దాంట్లో తగినంత పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. జుట్టు పాయలుగా విడదీస్తూ ఈ పేస్ట్ ను జుట్టు కుదుళ్ల నుండి జుట్టు చివర్ల వరకు అప్లై చేయాలి. ఒక గంట పాటు అలానే ఉంటచి ఆ తరువాత కడిగేయాలి. ఈ ప్యాక్ ను కూడా వారానికి రెండుసార్లు అప్లై చేయాలి. ఇలా చేస్తుంటే తెల్లజుట్టు నల్లగా మారుతుంది.
Read Also: Health Facts: డయాబెటిస్ ఉంది కదా అని చపాతీలను పక్కన పెట్టేస్తున్నారా..? గోధుమ పిండికి బదులుగా ఈ మూడింటినీ వాడితే..!
Updated Date - 2023-11-04T11:43:35+05:30 IST