White hair: ఏ మెడిసిన్స్ అక్కర్లేకుండానే.. కేవలం కొబ్బరి నూనెతోనే తెల్ల జుట్టును నల్లగా ఎలా మార్చొచ్చంటే..!
ABN, First Publish Date - 2023-08-09T17:37:26+05:30
జుట్టు నల్లగా నిగనిగలాడుతుంటే వృద్దులు కూడా యూత్ లాగా ఫీలవుతుంటారు. ఇక వయసులో ఉన్నవారికి తెల్లజుట్టు ఎంత సమస్య అవుతుందో చెప్పక్కర్లేదు. ఈ తెల్లజుట్టుకు కొబ్బరి నూనె చెక్ పెడుతుంది.
తెల్లజుట్టు ఇప్పట్లో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ వేధిస్తున్న సమస్య. 50, 60 ఏళ్ళు దాటినవారైనా తమ తెల్లజుట్టు బయటపడకుండా రంగు వేసి కవర్ చేస్తుంటారు. జుట్టు నల్లగా నిగనిగలాడుతుంటే వృద్దులు కూడా యూత్ లాగా ఫీలవుతుంటారు. ఇక వయసులో ఉన్నవారికి తెల్లజుట్టు ఎంత సమస్య అవుతుందో చెప్పక్కర్లేదు. ఈ తెల్లజుట్టుకు కొబ్బరి నూనె చెక్ పెడుతుంది. కొబ్బరినూనె ఎన్నో ఏళ్ళ నుండి ఆహార పదార్థాల తయారీలోనూ, చర్మ సంరక్షణలోనూ, కేశ సంరక్షణలోనూ ఉపయోగిస్తున్నారు. దీని గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ ఉండదులే అని అనుకుంటారు. కానీ అందరినీ వేధిస్తున్న తెల్లజుట్టు సమస్యకు కొబ్బరి నూనె చెక్ పెడుతుంది. జుట్టును శాశ్వతంగా నలుపురంగులోకి మారుస్తుంది. ఇందుకోసం కొబ్బరినూనెను మూడు రకాలుగా ఉపయోగించవచ్చు. అదెలాగో తెలుసుకుంటే..
కొబ్బరినూనె, గోరింటాకులు..(coconut oil, henna leaves)
కొబ్బరినూనెలో గోరింటాకు కలిపి రాసుకుంటే జుట్టు నలుపురంగులోకి మారుతుంది. ఇందుకోసం మూడు స్పూన్ల కొబ్బరినూనెలో కొద్దిగా గోరింటాకు వేయాలి. దీన్ని స్టవ్ మీద సన్నని మంట మీద ఉడికించాలి. తరువాత దీన్ని వడగట్టి ఈ నూనెను తలకు రాసుకోవాలి. జుట్టు కుదుళ్ళకు బాగా పట్టేట్టు మసాజ్ చేయాలి. సుమారు 40 నిమిషాల నుండి 1గంట సేపు ఈ నూనెను అలాగే ఉంచుకుని ఆ తరువాత గాఢత లేని షాంపూతో తలస్నానం చెయ్యాలి. వారానికి ఒకసారి ఈ పద్దతి ఫాలో అయితే జుట్టు మూలాల నుండి నల్లగా మారుతుంది. తెల్లజుట్టు శాశ్వతంగా తొలగిపోతుంది.
కొబ్బరినూనె, నిమ్మరసం..(coconut oil, lemon juice)
తెల్లజుట్టు సమస్యను తొలగించుకోవడానికి ఈ నూనె కూడా బాగా ఉపయోగపడుతుంది. మూడు చెంచాల కొబ్బరినూనె వేడిచేసి, అందులో సమాన పరిమాణంలో నిమ్మరసం కలపాలి. దీన్ని బాగా మిక్స్ చేసి జుట్టు కుదుళ్లలోకి బాగా ఇంకేలా మసాజ్ చేసుకోవాలి. గంటసేపు అలాగే ఉంచి ఆ తరువాత తల స్నానం చేయాలి. దీన్ని వారానికి ఒకసారి వాడుతుంటే తెల్లజుట్టు సమస్య తగ్గపోతుంది.
Viral News: ఇంజనీరింగ్ చదివి ఇదేం పనని అడిగితే.. ఆ క్యాబ్ డ్రైవర్ చెప్పింది విని నోరెళ్ల బెట్టిన మహిళ.. నిజమేనా అని ఆరా తీస్తే..!
కొబ్బరినూనె, ఉసిరికాయ.. (coconut oil, gooseberry)
కొబ్బరినూనె, ఉసిరికాయ జుట్టుకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. తెల్లజుట్టు తొలగించడంలో మ్యాజిక్ చేస్తుంది. రెండు స్పూన్ల ఉసిరికాయ పొడిని మూడు స్పూన్ల కొబ్బరినూనెలో కలపాలి. దీన్ని బాగా మిక్స్ చేసి సన్నని మంటమీద ఉడికించాలి. దీన్ని రాత్రిసమయంలో తలకు పట్టించి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం గాఢత లేని షాంపూతో తలస్నానం చేయాలి. విటమిన్-సి పుష్కలంగా ఉన్న ఈ నూనె జుట్టు నల్లగా కావడానికి మాత్రమే కాదు, జుట్టు దృఢంగా, ఒత్తుగా పెరగడంలో కూడా సహాయపడుతుంది.
Health Tips: అమ్మ బాబోయ్.. ఒకే ఒక్క లవంగం వల్ల ఇన్ని అద్భుతాలు జరుగుతాయా..? రోజూ పరగడుపున ఓ లవంగాన్ని తింటూ ఉంటే..
Updated Date - 2023-08-09T17:37:26+05:30 IST