వామ్మో.. పరీక్షల్లో కాపీ కొడితే ఏకంగా పదేళ్ల జైలు శిక్ష.. ఎక్కడో తెలుసా?
ABN, First Publish Date - 2023-02-13T21:13:01+05:30
పరీక్షల్లో కాపీ కొట్టే విద్యార్థులను, వారికి మద్దతిచ్చే వారిని క్షమించేది లేదని ఉత్తరాఖండ్ (Uttarakhand) ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ హెచ్చరించారు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో అక్రమాలకు పాల్పడిన నిందితులకు జీవిత ఖైదు లేదా పదేళ్ల జైలు శిక్ష పడుతుందని తెలిపారు.
పరీక్షల్లో కాపీ కొట్టే విద్యార్థులను, వారికి మద్దతిచ్చే వారిని క్షమించేది లేదని ఉత్తరాఖండ్ (Uttarakhand) ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ హెచ్చరించారు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో అక్రమాలకు పాల్పడిన నిందితులకు జీవిత ఖైదు లేదా పదేళ్ల జైలు శిక్ష పడుతుందని తెలిపారు. ఈ మేరకు యాంటీ కాపియింగ్ ఆర్డినెన్స్‌పై (anti-copying Ordinance) ఆ రాష్ట్ర గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) గుర్మిత్ సింగ్ సంతకం చేశారు. దీంతో ఉత్తరాఖండ్ కాంపిటేటివ్ కగ్జామినేషన్ ఆర్డినెన్స్ చట్టరూపం దాల్చించి.
బట్టతల ఉందని ఉద్యోగంలో నుంచి తీసేశారు.. బాస్ తీరుపై ఆ ఉద్యోగి కోర్టు మెట్లు ఎక్కితే..
ఉత్తరాఖండ్‌లో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ పేపర్ లీకేజీలపై విద్యార్థులు గత వారం పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. దీంతో సీఎం పుష్కర్ సింగ్ ధామీ (Pushkar Singh Dhami) ఈ ఆర్డినెన్స్‌ను రూపొందించారు. గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్స్ ఇప్పుడు చట్టంగా మారింది. యువత కలలతో తమ ప్రభుత్వం రాజీపడదని, వారి భవిష్యత్తును దెబ్బతీయడానికి ఎవరినీ అనుమతించబోమని పేర్కొన్నారు. రిక్రూట్‌మెంట్ స్కామ్, పేపర్ లీకేజీల్లో (scams and paper leak cases) ఎవరైనా పట్టుబడితే 10 ఏళ్ల జైలుశిక్షతోపాటు (10 years in jail), వారి ఆస్తులను కూడా జప్తు చేస్తామని హెచ్చరించారు.
Updated Date - 2023-02-13T21:13:03+05:30 IST