ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mustard Oil: మనం ఇష్టంగా తినే ఆవనూనె..ఒకేఒక్క కారణంతో అమెరికాలో నిషేధం.. ఆవనూనెతో ఇంతటి ప్రమాదమా?

ABN, Publish Date - Dec 15 , 2023 | 03:25 PM

భారతీయుల ఆహారంలో భాగమైన ఆవా నూనెపై అమెరికాలో మాత్రం నిషేధం ఉంది. దీని వెనుక్క పెద్ద కారణమే ఉందని అక్కడి వర్గాలు చెబుతున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: వంటింట్లో ఆవాలు లేని భారతీయ కుటుంబం ఉండదంటే అతిశయోక్తి కాదు. భారత్‌లోనే కాదు.. థాయ్‌ల్యాండ్, పాకిస్థాన్‌లోనూ ఆవాలు, ఆవనూనె (Mustard Oil) తప్పనిసరిగా వంటకాల్లో ఉండాల్సిందే. ఇంతటి ప్రాముఖ్యత రుచి కలిగిన ఆవనూనెను అమెరికా (USA), ఐరోపా (Europe) అంతటా బ్యాన్ చేశారంటే ఆశ్చర్యం కలగకమానదు. ఈ నిషేధం (Banned) వెనుక పెద్ద కారణమే ఉందని అక్కడి వర్గాలు చెబుతున్నాయి.


అమెరికాలోని ఆహార నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ ప్రకారం, ఆవాల్లో ఇరుసిక్ యాసిడ్ (Erucic Acid) అనే కొవ్వు పదార్థం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇరుసిక్ యాసిడ్ అనారోగ్యానికి కారణమని అక్కడి వారు చెబుతున్నారు. ఇది జ్ఞాపకశక్తి తగ్గుదల, ఇతర మెదడు సంబంధిత సమస్యలకు దారి తీస్తుందట. అంతేకాకుండా, దీని వల్ల శరీరంలో కొవ్వు కూడా పేరుకుంటుందట. దీంతో, అమెరికాతో పాటూ కెనడా, ఐరోపా దేశాల్లో ఆవనూనెను నిషేధించారు. అంటే..అక్కడ ఆవనూనెను తినడంపై నిషేధం ఉంది. ఆవనూనెతో చేసిన వంటకాలు అస్సలు కనిపించవు. అయితే, ఆవనూనెను చర్మసౌందర్యం కోసం పైపూతగా వాడుకునేందుకు మాత్రం అనుమతి ఉంది.


ఆవనూనెకు బదులుగా ఆయా దేశాల్లో సోయా నూనెను (Soyabean Oil) వంటల్లో వాడతారు. సోయా నూనెలో ఒమెగా 3, ఓమెగా-6 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయట. ఇది శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఫలితంగా దేహధారుఢ్యం పెరగడంతో పాటూ చర్మకాంతి ఇనుమడిస్తుంది. సోయా నూనెలో ఉండే విటమిన్ ఈ కూడా చర్మం, జుట్టు ఆరోగ్యానికి ఎంతో కీలకం. అయితే, ఆవాల్లో ఇరుసిక్ యాసిడ్ స్థాయిల్ని తగ్గించేందుకు కూడా పరిశోధనలు జరుగుతున్నాయి.

Updated Date - Dec 15 , 2023 | 03:25 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising