ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ రైల్వే‌స్టేషన్ల పేర్ల చివర రోడ్డు అని ఎందుకు ఉంటుంది? అవి ఊరికి దూరంగా ఎందుకున్నాయి?... సమాధానమిదేనని తెలిస్తే..

ABN, First Publish Date - 2023-04-22T13:14:30+05:30

మన దేశంలోని కొన్న రైల్వే స్టేషన్ల(Railway stations) పేరు చివర రోడ్డు అనే పదాన్ని తగిలిస్తారు. ఎందుకు ఇలా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మన దేశంలోని కొన్ని రైల్వే స్టేషన్ల(Railway stations) పేరు చివర రోడ్డు అనే పదాన్ని తగిలిస్తారు. ఎందుకు ఇలా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. రైల్వే స్టేషన్ పేరు వెనుక రోడ్డు(road) అని తగిలించారంటే ఆ స్టేషన్ నగరానికి దూరంగా ఉందని అర్థం. దీనిని తెలియజేసేందుకే రోడ్డు అనే పదాన్ని ఉపయోగిస్తారు. అంటే అక్కడి నుంచి ఉన్న రహదారిమీదుగా నగరానికి వెళ్లాల్సి ఉంటుందని అర్థం. అంటే మీరు నగరానికి(city) కొంతదూరంలో రైలు దిగారని అర్థం.

రైల్వే అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం రైల్వే స్టేషన్‌తో అనుసంధానమైన 'రోడ్డు' అనే పదం ఆ రైల్వే స్టేషన్ నుండి ఆ నగరానికి వెళ్లడానికి కొద్దిగా దూరం ఉందని అర్థం. ఆ నగరానికి వెళ్లే రైలు ప్రయాణికులు(Train passengers) అక్కడే దిగాలని ఆ స్టేషన్ బోర్డు సూచిస్తుంది. అయితే ఆ నగరానికి రైల్వే స్టేషన్ ఎంత దూరంలో ఉందనే ప్రశ్న మన మదిలో మెదులుతుంది. ఈ తరహా స్టేషన్ నుండి, నగరం 2 కి.మీ. నుండి 100 కి.మీ. దూరం వరకు కూడా ఉండవచ్చు.

ఉదాహరణకు కొడైకెనాల్ నగరం(Kodaikanal city) కొడైకెనాల్ రోడ్డు రైల్వే స్టేషన్ నుండి 79 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదేవిధంగా హజారీబాగ్ రోడ్ రైల్వే స్టేషన్ హజారీబాగ్ సిటీ నుండి 66 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాంచీ సిటీ రాంచీ రోడ్ స్టేషన్ నుండి 49 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆయా నగరాలకు రైల్వే లైన్‌ వేయడంలో ఏదైనా భారీ సమస్య ఉన్నప్పుడు మాత్రమే రైల్వే స్టేషన్‌లను ఊరికి దూరంగా నిర్మిస్తారు. మౌంట్ అబూ(Mount Abu) పర్వతంపై రైలు మార్గాన్ని వేయడానికి చాలా ఖర్చు అవుతుంది. అందుకే అబూకు 27 కిలోమీటర్ల దూరంలో పర్వతం కింద రైల్వే స్టేషన్ నిర్మించారు.

Updated Date - 2023-04-22T13:14:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising