Wife Shocking Decision: నా భర్త సంతోషమే నాకు ముఖ్యం.. వేరే స్త్రీలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నా బాధలేదంటూ ఓ భార్య వింత నిర్ణయం..!
ABN, First Publish Date - 2023-03-29T18:11:39+05:30
తన భర్త తనకే స్వంతమవ్వాలని, వేరే మహిళ వైపు కన్నెత్తి కూడా చూడకూడదని భార్యలు కోరుకుంటారు. భర్త వేరే మహిళతో మాట్లాడుతున్నట్టు అనుమానం వస్తే చాలు అతడితో గొడవపెట్టుకుంటారు.
తన భర్త (Husband) తనకే స్వంతమవ్వాలని, వేరే మహిళ వైపు కన్నెత్తి కూడా చూడకూడదని భార్యలు (Wife) కోరుకుంటారు. భర్త వేరే మహిళతో మాట్లాడుతున్నట్టు అనుమానం వస్తే చాలు అతడితో గొడవపెట్టుకుంటారు. అలాంటిది ఓ మహిళ తీసుకున్న వింత నిర్ణయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. భర్త సంతోషం కోసం ఏమైనా చేస్తానంటున్న ఓ మహిళ వెరైటీ ఆలోచన చాలా మందిని షాక్‌కు గురి చేస్తోంది. ఈ ఘటన అమెరికాలో (USA News) చోటు చేసుకుంది.
అమెరికాకు చెందిన మోనికా హల్డ్ అనే మహిళ.. భర్తపై తనకున్న ప్రేమను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇంటి పనుల్లోనూ, వంట పనుల్లోనూ తాను బిజీగా ఉన్నప్పుడు తన భర్త మరో అమ్మాయితో రొమాన్స్ (Romance) చేసినా తాను పట్టించుకోనని చెబుతోంది. తన ప్రథమ కర్తవ్యం తన భర్తను సంతోషపెట్టడమేనని నమ్ముతోంది. తన భర్త సంతోషంగా ఉంటేనే తమ బంధం మరింత బలంగా ఉంటుందని చెబుతోంది. అందుకోసం తన భర్త వేరే మహిళలతో సంతోషంగా ఎంజాయ్ చేయడాన్ని తాను అనుమతిస్తానని అంటోంది (Wife Allows husband to romance with other girls).
Viral News: ఓ విద్యార్థి మార్కుల షీట్ పై.. Passed Out అని రాయబోయి.. Passes Away అని రాసిన టీచర్..!
``నేను చేస్తున్న ఈ పని చాలా మంది ఆడవాళ్లకు నచ్చకపోవచ్చు. కానీ, వేరే మహిళలతో రొమాన్స్‌ను అనుమతించడం వల్ల నా భర్తకు నాపై అసహనం, చిరాకు కలగదు. కానీ, నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు. అందమైన అమ్మాయిలంటే జాన్‌కు చాలా ఇష్టం. జాన్‌కు ఇష్టమైనది చేయడం నాకు ఇష్టం`` అని మోనికా చెబుతోంది. మోనికా వాదన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. కుప్పకూలిన గోల్డ్ మైన్.. మట్టిలో ఇరుక్కుపోయిన కార్మికులను ఎలా కాపాడారో చూడండి..!
Updated Date - 2023-03-29T18:11:39+05:30 IST