వేలంటైన్స్ డే సందర్భంగా గిప్టులు కొనేందుకు రూ.15 వేలు అడిగిన భార్య.. ఇవ్వనన్న భర్త.. చివరకు ఇదీ అతడి పరిస్థితి..!
ABN, First Publish Date - 2023-02-14T15:09:56+05:30
నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు (Valentine's Day). యువతీ యుకులు వాలంటైన్స్ డే రోజున బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది సాధారణ విషయమే. కోల్‌కతాకు (Kolkata)చెందిన ఓ మహిళ కూడా వాలెంటైన్స్ డే రోజు కోసం గిఫ్టులు కొనాలనుకుంది.
నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు (Valentine's Day). యువతీ యుకులు వాలంటైన్స్ డే రోజున బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది సాధారణ విషయమే. కోల్‌కతాకు (Kolkata)చెందిన ఓ మహిళ కూడా వాలెంటైన్స్ డే రోజు కోసం గిఫ్టులు కొనాలనుకుంది. అందుకోసం తన భర్తను రూ.15 వేలు అడిగింది. అయితే భర్త అంత డబ్బు ఇవ్వలేకపోవడంతో గాజుతో భర్త తల పగలగొట్టి డబ్బులు తీసుకుని వెళ్లిపోయింది (Wife beats Husband).
నరేంద్రపూర్‌కు చెందిన అజిత్ చౌదరి, మామ్నీ దేవి ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 7 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. వాలంటైన్స్ డే గిఫ్టుల (Valentine's Day gifts) కోసం మామ్నీదేవి తన భర్తను రూ.15 వేలు అడిగింది. డబ్బులు ఇచ్చేందుకు అజిత్ నిరాకరించడంతో మామ్ని గొడవకు దిగింది. గ్లాస్ టంబ్లర్‌తో కొట్టి భర్త నుంచి 15 వేల రూపాయలు లాక్కెళ్లింది. ఇరుగుపొరుగు వారు అజిత్‌ను రక్షించి ఆసుపత్రికి తరలించారు. అక్కడ అజిత్‌కు ఆరు కుట్లు పడ్డాయి.
అక్కతో సంబంధం ఖాయం చేసుకున్నారు.. కానీ పెళ్లి జరిగింది మాత్రం చెల్లితో.. వివాహం జరిగిన మర్నాడే షాకింగ్ ట్విస్ట్..!
హాస్పిటల్‌లో చికిత్స అందుకున్న తర్వాత అజిత్ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తనను గాయపరిచిన భార్యపై ఫిర్యాదు చేశాడు. పెళ్లి జరిగిన తర్వాత తన భార్య తనను చాలా సార్లు కొట్టిందని పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు (Crime News).
Updated Date - 2023-02-14T15:09:58+05:30 IST