ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: ఎంత పని చేశావమ్మా.. విమానం గాల్లో ఉండగా కుక్కను బోనులోంచి బయటకు తీయడంతో..

ABN, First Publish Date - 2023-09-12T17:18:54+05:30

విమానం గాల్లో ఉండగా బోనులోని పెంపుడు కుక్కను బయటకు తీసి తన ఒళ్లో కూర్చోబెట్టుకున్న మహిళపై పోలీసు కేసు నమోదైంది. ఇటీవల ఢిల్లీ నుంచి గోవాకు బయలుదేరిన విమానంలో ఈ ఘటన వెలుగు చూసింది.

ఇంటర్నెట్ డెస్క్: పెంపుడు కుక్కతో పాటూ విమానం ఎక్కిందో మహిళ. ఆ తరువాత విమానం గాల్లో ఉండగా ఆమె చేసిన పనికి ప్రయాణికులు హడలెత్తిపోయారు. ఫలితంగా నానా రచ్చ జరిగింది. చివరకు ఆమెపై ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు పెట్టారు. ఇటీవల న్యూఢిల్లీ నుంచి గోవా బయలుదేరిన విమానంలో(Goa bound flight) ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

అలీషా అధానా అనే మహిళ, తన బంధువుతో కలిసి ఢిల్లీలో(New Delhi) విమానమెక్కింది. తన వెంట ఆమె ఓ పెంపుడు కుక్కను కూడా తెచ్చుకుంది. అయితే, కుక్కను చిన్న బోనులో పెట్టుకుని తెచ్చుకుంది. కానీ విమానం ఎగిరే క్రమంలో టర్బులెన్స్‌కు లోనవడంతో భయపడిపోయిన కుక్క పెద్ద పెట్టున మొరగడం ప్రారంభించింది. దాన్ని శాంతింప చేసేందుకు మహిళ కుక్కను బోనులోంచి బయటకు తీసి తన ఒళ్లో కూర్చోపెట్టుకుంది(Woman let dog out mid flight). దీంతో ప్రయాణికులు భయపడిపోయారు.


కుక్క ఎవరినన్నా కరవచ్చనే ఆందోళనను తోటి ప్రయాణికులు వ్యక్తం చేశారు. దీంతో, విమానంలో రచ్చ రచ్చ జరిగింది(Passengers got scarred). అనేక మంది ఆమె తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమెపై ఫిర్యాదు చేయాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో, విమానం ల్యాండవగానే ఫ్లైట్ మ్యానేజర్ మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గోవా పోలీసులు మహిళపై ఐపీసీ సెక్షన్ 336 కింద కేసు నమోదు చేశారు(Case filed against woman).

విమాన నిబంధనల ప్రకారం, విమానం గాల్లో ఉండగా పెంపుడు జంతువుల బోనులు తెరిచి వాటిని బయటకు వదలకూడదు. ఈ నిబంధనను అతిక్రమించిన మహిళ చివరకు చిక్కుల్లో పడింది. ఈ ఏడాది జనవరిలో ఓ మహిళ తనకు తోటి ప్రయాణికురాలి కారణంగా ఇలాంటి అనుభవమే ఎదురైందని చెప్పుకొచ్చింది. ఓ మహిళ తన వెంట ప్రమాదకరమైన పిట్ బుల్ జాతి కుక్కను విమానంలోకి తెచ్చుకుందని చెప్పింది. ఆ తరువాత దాన్ని బోనులోంచి బయటకు వదలడంతో అది తన వస్తువుల్లో కొన్నిటికి పాడు చేసిందని కూడా చెప్పుకొచ్చింది.

Updated Date - 2023-09-12T17:18:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising