ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: ఎన్నారై సంబంధం.. గిఫ్ట్ పంపిచ్చానని కాబోయే భర్త చెప్పడంతో సంబరపడ్డ మహిళ.. ఓ రోజు వచ్చిన ఫోన్‌కాల్‌తో..

ABN, First Publish Date - 2023-10-09T19:43:43+05:30

మ్యాట్రిమోనియల్ సైట్‌లో మంచి ఎన్నారై సంబంధం దొరికిందని సంబర పడ్డ మహిళ చివరకు భారీ షాక్ తగిలింది. బాధితురాలు ఏకంగా రూ.10.3 లక్షలు నష్టపోవాల్సి వచ్చింది.

ఇంటర్నెట్ డెస్క్: మ్యాట్రిమోనియల్ సైట్‌లో మంచి ఎన్నారై సంబంధం దొరికిందని సంబర పడ్డ మహిళకు చివర్లో భారీ షాక్ తగిలింది. బాధితురాలు ఏకంగా రూ.10.3 లక్షలు నష్టపోవాల్సి వచ్చింది. ఇటీవల చెన్నైలో(Chennai) ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే, అయనవరానికి చెందిన బాధితురాలు కొంత కాలం క్రితం మ్యాట్రిమోనియల్ సైట్‌లో తనకు తగిన జోడీ కోసం వెతికింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆమెను సంప్రదించాడు. తాను ఎన్నారైనని చెప్పుకున్నాడు. ఆ తరువాత వారిద్దరూ వాట్సాప్‌లో తరచూ మాట్లాడుకోవడం ప్రారంభించారు(Woman loses Rs 10L in matrimonial fraud).

Viral: డాక్టర్‌ చేతిరాత అర్థంకాక మెడికల్ షాపు సిబ్బంది ఘోర తప్పిదం.. మహిళ జీవితం తలకిందులు..

అతడి తీరు నచ్చడంతో ఆమె అతడితో పెళ్లికి రెడీ అయ్యింది. ఈ క్రమంలో ఓ రోజు అతడు ఆమెకు విదేశాల నుంచి బహుమతి పంపిస్తున్నానని ఫోన్‌లో చెప్పాడు. ఆ తరువాత మహిళ అడ్రస్ అడిగాడు. ఇందులో సందేహించేందుకు ఏమీ లేకపోవడంతో ఆమె అతడు చెప్పినట్టు చేసింది. ఆ తరువాత కొన్ని రోజులకు మరో వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి తాను కస్టమ్స్ అధికారినని పరిచయం చేసుకున్నాడు. మహిళకు కాబోయే భర్త పంపించిన బహుమతి తమ వద్ద ఉందని, కొన్ని రకాలు పన్నులు చెల్లిస్తే బహుమతి ఇంటికి పంపిస్తామని చెప్పుకొచ్చాడు.


Viral: స్కూటీపై వెళుతూ కింద పడ్డ యువతులు..సాయం చేస్తానంటూ వచ్చి ఓ అపరిచితుడు చేసిన పనికి..

ఆ వ్యక్తి మాటలు నమ్మేసిన మహిళ అతడు చెప్పిన మొత్తాన్ని ఆన్‌లైన్‌లో బదిలీ చేసింది. ఆ తరువాత ‘కస్టమ్స్ అధికారి’ ఆమెకు పలుమార్లు ఫోన్ చేసి రకరకాల పన్నుల పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేశాడు. ఈ క్రమంలో మహిళ ఏకంగా రూ.10.6 లక్షలు పోగొట్టుకున్నాక తాను మోసపోయానన్న విషయం గ్రహించింది. చివరకు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మహిళ నుంచి వివిధ అకౌంట్ల ద్వారా నిందితులకు సొమ్ము చేరినట్టు గుర్తించారు. వారు వాడిన సిమ్ కార్డులన్నీ నోయిడా ప్రాంతానికి చెందినవిగా గుర్తించారు. ఈ క్రమంలో పోలీసులు ఢిల్లీలో ఉంటున్న ఓ ఆఫ్రీకా వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడే ఈ మోసంలో కీలక పాత్రధారి అని తేల్చారు.

Updated Date - 2023-10-09T19:48:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising