ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: షాకింగ్.. విమానప్రయాణికురాలిని 2 గంటల పాటు బాత్రూమ్‌కు వెళ్లనీయకపోవడంతో ఆమె ఊహించని విధంగా..

ABN, First Publish Date - 2023-07-23T19:01:55+05:30

సిబ్బంది తనను రెండు గంటల పాటు బాత్రూమ్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారంటూ ఓ మహిళ విమానం ఫ్లోర్‌పైనే మూత్ర విసర్జనకు పాల్పడింది. అమెరికాకు చెందిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్‌లో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది.

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో తాజాగా ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తనను బాత్రూమ్‌లో వెళ్లకుండా విమాన సిబ్బంది అడ్డుకోవడంతో ఓ మహిళా ప్రయాణికురాలు అందరూ చూస్తుండగానే విమానం ఫ్లోర్‌పై మూత్ర విసర్జన చేసేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. స్పిరిట్ ఎయిర్‌లైన్స్(Spirit Airlines) విమానంలో ఈ ఘటన జరగ్గా దీనిపై సంస్థ ఇప్పటివరకూ స్పందించలేదు.

మహిళా ప్రయాణికురాలి ఆరోపణల ప్రకారం, సిబ్బంది ఆమెను బాత్రూమ్‌కు వెళ్లకుండా రెండు గంటల పాటు అడ్డుకున్నారు. ‘‘ఇక నా వల్ల కాదు, ఇప్పటికే రెండు గంటలు దాటిపోయాయి. మీరే నన్ను వాష్‌రూమ్ వాడుకోనియలేదు. తలుపులు మూసేశారు. విమానం ఇంకా ఎయిర్‌పోర్టులోనే ఉంది. ఇక నా వల్ల కాదు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి’’ అంటూ ఆమె నిలబడ్డ చోటునే తన పని కానిచ్చేసింది(Woman urinates on flight floor).

సిబ్బంది మాత్రం ఆమె చర్యను వీడియోలో రికార్డు చేశారు. కానీ ప్రయాణికురాలు మాత్రం వెనక్కు తగ్గలేదు. ‘‘కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి. ఈ పరిస్థితికంటే అదే నయం’’ ఆమె చెప్పింది. అయితే, దీనికి జవాబుగా..‘‘నీళ్లు ఎక్కువగా తాగు.. దుర్వాసన వస్తోంది’’ అంటూ విమాన సిబ్బంది ఒకరు వింత సమాధానమిచ్చినట్టు కూడా తెలిసింది.

అయితే, అమెరికాలో ఇలాంటి ఘటన వెలుగు చూడటం ఇదే తొలిసారి కాదు. 2018లో ఓమారు విజ్ ఎయిర్ ఫ్లైట్‌లో లండన్ నుంచి వార్సా వెళుతున్న ఓ మహిళను ఇదే విధంగా బాత్రూమ్‌కు వెళ్లనీయకపోవడంతో ఆమె విమానం ఫ్లోర్‌పైనే మూత్రవిసర్జనకు దిగింది. విమానంలో ఇంధనం నింపుతుండటంతో ఆమెను బాత్రూమ్‌లోకి అనుమతించలేదని అప్పట్లో విమానయాన సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. విమాన నిర్వహణకు సంబంధించి ఇదో ప్రామాణిక ప్రోటోకాల్ అని చెప్పారు.

Updated Date - 2023-07-23T19:03:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising