Women's Pants: అమ్మాయిలు ధరించే ప్యాంట్లకు జేబులు పెద్దగా ఎందుకు ఉండవ్.. ఫ్యాషన్ కాదండోయ్.. అసలు కథ వేరే ఉంది..!
ABN, First Publish Date - 2023-06-14T16:03:31+05:30
ఫ్యాషన్ ప్రపంచంలో ప్యాంట్లకు ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఈ ప్యాంట్లు కూడా నిన్నా మొన్నా ప్రజల్లోకి వచ్చినవేమీ కాదు. ఇప్పటికాలంలో రహదారుల మీద అమ్మాయిను గమనిస్తే సగానికి సగం మంది ప్యాంటులలోనే దర్శనమిస్తారు. అయితే అమ్మాయిల ప్యాంటులకు జేబులు మాత్రం
ఇప్పటికాలంలో రహదారుల మీద అమ్మాయిను గమనిస్తే సగానికి సగం మంది ప్యాంటులలోనే దర్శనమిస్తారు. అయితే అమ్మాయిల ప్యాంటులకు జేబులు మాత్రం పెద్దగా ఉండవు. 'అబ్బాయిల ప్యాంట్లకు పాకెట్స్ ఉన్నట్టు అమ్మాయిల ప్యాంట్లకు జేబులు పెద్దగా ఎందుకు ఉండవు' అనే అనుమానం ఎప్పుడైనా వచ్చిందా? ఇదేమైనా ఫ్యాషన్ అయి ఉంటుందిలే అని చాలామంది అనుకుంటారేమో.. కానీ దీని వెనుక కారణం వేరే ఉంది. అది కారణం కూడా కాదు.. ప్యాంట్లకు పాకెట్స్ లేకపోవడం వెనుక పెద్ద కథే ఉంది. దీని గురించి తెలుసుకుంటే..
ఫ్యాషన్ ప్రపంచంలో ప్యాంట్లకు ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఈ ప్యాంట్లు కూడా నిన్నా మొన్నా ప్రజల్లోకి వచ్చినవేమీ కాదు. వీటికి కూడా శతాబ్దాల కొద్దీ చరిత్ర ఉంది. మగాళ్ళ బట్టలు గమనిస్తే చొక్కాలకు, ప్యాంట్లకు, కోట్స్ కు లక్షణంగా పెద్ద పాకెట్స్ ఉంటాయి. డబ్బు, పర్స్, మొబైల్ వంటివన్నీ ఈ పాకెట్స్ లోనే పెట్టుకుంటూ ఉంటారు. కానీ మహిళల దుస్తులకు పాకెట్స్ ఉండటం చాలా అరుదు. అందులోనూ అమ్మాయిల ప్యాంట్లకు అయితే పాకెట్స్ పెద్దగా ఉండవు(Womens pants have no more big pockets). అయితే మహిళల దుస్తులకు పాకెట్స్ లేకపోవడం అనేది ఇప్పటికాదు. ఇది 17వశతాబ్దం నాటి చరిత్ర(17th centuary history). అప్పట్లో ప్రతి ఒక్కరికి దుస్తులలోపల పాకెట్లు కుట్టేవారు. మగవారు దుస్తులలోపల పాకెట్స్ నుండి డబ్బును, తదితరాలను బయటకు తీయడం సులభంగానే ఉండేది. కానీ అప్పటి వస్త్రాధారణ కారణంగా ఆడవారికి ఇది కష్టంగా ఉండేది. అందుకే అప్పట్లో మహిళల దుస్తులకు పాకెట్లు ఉండేవి కావు. అయితే మహిళల దుస్తులకు కూడా పాకెట్లు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నప్పుడు ఫ్రెంచ్ విప్లవం(french revolution) వచ్చింది. దీని కారణంగా వస్ర్తప్రపంచం మారిపోయింది. చిన్నగా ఉన్న స్కర్టులు ఫ్యాషన్ అయ్యాయి. వీటికి పాకెట్స్ పెట్టడానికి స్థలం సరిపోయేది కాదు. మహిళలు రహస్యంగా వస్తువులను తదితరాలను తీసుకెళ్ళడానికి వీల్లేకుండా చేయాలనే ఇలా మహిళల దుస్తులకు పాకెట్స్ పెట్టకుండా చేశారనే వాదన కూడా ఉంది.
AC: ఏసీలు ఎందుకు కాలిపోతుంటాయ్..? ఈ 4 అంశాలే అసలు కారణాలు.. గది చల్లగానే ఉంది కదా అని పట్టించుకోరు కానీ..!
కాగా మహిళల ప్యాంట్లకు పాకెట్స్ లేకపోవడానికి మరొక కారణం కూడా చెబుతారు. అదే హ్యాండ్ బ్యాగ్(hand bag) ఎంట్రీ. హ్యాండ్ బ్యాగులను, క్లచ్ లను, వాలెట్లను దుస్తులకు తగినట్టుగా తీసుకెళ్ళడం మహిళల ఫ్యాషన్ లో భాగమైంది. మహిళల ప్యాంట్లకు పాకెట్స్ లేకపోవడం వెనుక ఈ హ్యండ్ బ్యాగ్ పరిశ్రమ ప్రణాళికలు కూడా చాలా ఉన్నాయని చెబుతారు. సాధారణంగానే మహిళలు బయటకు వెళ్లినప్పుడు చిన్న చిన్న మేకప్ సామాగ్రి నుండి ఎన్నోరకాల వస్తువులను వెంట తీసుకెళతారు. దీనికి పాకెట్స్ అనువుగా ఉండవు.
Bathing: రోజుకు రెండుసార్లు స్నానం చేస్తున్నా సరే.. అందరూ కామన్‌గా చేసే ఒకే ఒక్క మిస్టేక్ ఇదే.. తప్పు చేస్తున్నామని తెలియకుండానే..!
Updated Date - 2023-06-14T16:03:31+05:30 IST