ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ జీవి తన జీవితాంతం శ్వాస తీసుకోదు.. మరెలా మనుగడ సాగిస్తుందో తెలిస్తే..

ABN, First Publish Date - 2023-04-11T12:11:14+05:30

ఈ ప్రపంచంలో శ్వాస తీసుకోకుండా(Without breathing) ఏ జీవి కూడా మనుగడ సాగించలేదు. అయితే దీనికి భిన్నంగా శ్వాస అవసరం లేని ఒక జీవి ఉంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఈ ప్రపంచంలో శ్వాస తీసుకోకుండా(Without breathing) ఏ జీవి కూడా మనుగడ సాగించలేదు. అయితే దీనికి భిన్నంగా శ్వాస అవసరం లేని ఒక జీవి ఉంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. శ్వాస తీసుకోవాలంటే ఏ జీవికైనా మైటోకాన్డ్రియల్ జీనోమ్(mitochondrial genome) ఉండటం చాలా ముఖ్యం. అయితే ఆశ్చర్యకరంగా జెల్లీ ఫిష్‌(Jellyfish) మాదిరిగా కనిపించే ఒక బహుళ సెల్యులార్ పరాన్నజీవికి మైటోకాన్డ్రియల్ జీనోమ్ అస్సలు లేదు.

ఫలితంగా ఈ పరాన్నజీవి(parasite) మనుగడకు ఆక్సిజన్ అవసరం లేదు. ఈ పరాన్నజీవి శాస్త్రీయ నామం హెన్నిగుయా సాల్మినికోలా(Henniguia salminicola). అయితే ఆక్సిజన్ లేకుండా మనుగడ సాగించే ఇలాంటి జీవి భూమిపై ఎలా అభివృద్ధి చెందిందనేది శాస్త్రవేత్తలు(Scientists) తలలు పట్టుకుంటున్నారు. ఈ అద్భుతమైన పరాన్నజీవిని ఇజ్రాయెల్‌(Israel)లోని టెల్-అవివ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం కనుగొంది.

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఈ పరాన్నజీవి చేపల నుండి శక్తిని పొందుతుంది. అయితే ఇందుకోసం అది వాటికి ఏ విధంగానూ హాని చేయదు. అలాగే చేపలు కూడా ఈ పరాన్నజీవికి హాని చేయవు. ఈ పరాన్నజీవి సాల్మన్ చేప(Salmon fish)లలో కనిపిస్తుంది. చేప సజీవంగా ఉన్నంత కాలం మాత్రమే ఇది సజీవంగా ఉంటుంది. హెన్నిగుయా సాల్మినికోలా(Henniguia salminicola) మానవులకు లేదా ఇతర జీవులకు ఏమాత్రం హానికరం కాదని పరిశోధకులు తెలిపారు.

పరిశోధన సమయంలో శాస్త్రవేత్తలు మైక్రోస్కోప్ (ఫ్లోరోసెన్స్ మైక్రోస్కోప్)తో ఈ జీవిని గమనించినప్పుడు, వారికి అందులో మైటోకాన్డ్రియల్ DNA కనిపించలేదు. దీని తర్వాత ఇది ప్రపంచంలోనే మొదటి జీవి(first creature) అని స్పష్టమైంది. ఇది జీవించడానికి శ్వాస అవసరం లేదు. అయితే, 2010 సంవత్సరంలో కూడా ఇలాంటి జీవిని ఇటలీ పరిశోధకులు(Italian researchers) కనుగొన్నారు. ఆ జీవి శక్తికి మూలం హైడ్రోజన్ సల్ఫైడ్(Hydrogen sulfide). కాగా కొత్తగా కనుగొన్న ఈ హెన్నెగుయా సాల్మినికోలాకు హైడ్రోజన్ సల్ఫైడ్ కూడా అవసరం లేకపోవడం విశేషం.

Updated Date - 2023-04-11T12:12:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising