ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral: యూట్యూబర్ ఇచ్చిన గొప్ప బహుమతి.. వెయ్యి మందికి కంటిచూపు..

ABN, First Publish Date - 2023-01-30T22:00:21+05:30

ప్రముఖ యూట్యూబర్ జిమ్మీ డోనాల్డ్‌సన్.. కంటిచూపు కోల్పోయిన వందల మంది జీవితాల్లో కొత్త వెలుగు తీసుకొచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ యూట్యూబర్ జిమ్మీ డోనాల్డ్‌సన్(Jimmy Donaldson).. కంటిచూపు కోల్పోయిన వందల మంది జీవితాల్లో కొత్త వెలుగు తీసుకొచ్చారు. మొత్తం వెయ్యి మంది కాటరాక్ట్(Cataract) ఆపరేషన్ ఖర్చును తానే భరించారు. ఆపరేషన్ చేయించుకునే స్తోమత లేనివారికి ఆర్థికసాయం, ఇతరత్రా చేయూతను అందించారు. ఆయన సాయంతో కంటిచూపు పొందిన వారి సంఖ్య ప్రస్తుతం వెయ్యికి చేరుకుంది. యూట్యూబ్‌లో జిమ్మీ.. మిస్టర్ బీస్ట్‌గా బాగా పాపులర్. ఈ మహాక్రతువులో తొలి విడత ఆపరేషన్లను డా. జెఫ్ లెవెన్సన్ నిర్వహించారు. జమైకా, హాండురస్, నమీబియా, మెక్సికో, ఇండోనేషియా, బ్రెజిల్, వియత్నాం, కెన్యాకు చెందిన వారికి ఈ ఆపరేషన్లు నిర్వహించారు.

‘‘ప్రపంచంలోని చూపు లేనివాళ్లలో సగం మందికి కావాల్సింది పది నిమిషాల్లో చేసే ఈ శస్త్రచికిత్సే’’ అంటూ డా. జెఫ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జిమ్మీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘‘ఇలాంటి గొప్ప పని గురించి నేనెప్పుడూ వినలేదు’’ అని పలువురు వ్యాఖ్యానించారు. ‘‘నీవెప్పటికీ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతావు’’ అంటూ మరికొందరు జిమ్మీని పొగడ్తల్లో ముంచెత్తారు.

Updated Date - 2023-01-30T22:12:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising