ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ajinkya Rahane: సూపర్ ఫామ్‌లో రహానే.. ఇక, సెలక్టర్లకు మరో దారి లేదు.. ఏ నిర్ణయం తీసుకుంటారో..!

ABN, First Publish Date - 2023-04-24T08:41:11+05:30

అజింక్యా రహానే.. ఈ ఐపీఎల్ ముందు వరకు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న రహానేను ఐపీఎల్ మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ నామ మాత్రపు ధరకు దక్కించుకుంది. చెన్నై టీమ్ కూడా రహానేపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అజింక్యా రహానే (Ajinkya Rahane).. ఈ ఐపీఎల్ (IPL 2023) ముందు వరకు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న రహానేను ఐపీఎల్ మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ (CSK) నామ మాత్రపు ధరకు దక్కించుకుంది. చెన్నై టీమ్ కూడా రహానేపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ రహానేను తీసుకోలేదు. అయితే ముంబైతో మ్యాచ్‌‌కు (MIvsCSK) ముందు మెయిన్ అలీ గాయపడడంతో అతడి స్థానంలో రహానే తుది జట్టులోకి వచ్చాడు. అంది వచ్చిన అవకాశాన్ని రహానే చక్కగా వినియోగించుకున్నాడు. ఆ మ్యాచ్‌లో 27 బంతుల్లోనే 61 పరుగులు చేసి తన టీమ్‌కు విజయాన్ని అందించాడు.

ఆ తర్వాతి మ్యాచ్‌ల్లో కూడా రహానే నమ్మశక్యం కాని రీతిలో ఆడుతున్నాడు. నిజానికి టీ-20 క్రికెట్‌కు రహానే పనికిరాడని ఎప్పట్నుంచో విమర్శ ఉంది. ఆ విమర్శలన్నింటికీ తాజా సీజన్‌లో రహానే చెక్ పెట్టాడు. మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఆదివారం కోల్‌కతాపై (KKRvsCSK) జరిగిన మ్యాచ్‌లో రహానే 29 బంతుల్లోనే 71 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన రహానే 209 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 180కి పైగా ఉండడం గమనార్హం.

Arshdeep Singh: రెండుసార్లు స్టంప్‌లు విరగ్గొట్టిన అర్ష్‌దీప్ సింగ్.. బీసీసీఐకి ఎంత నష్టమో తెలుసా?

గతేడాది కాలంగా రహానే టీమిండియాకు దూరమయ్యాడు. తాజాగా ఐపీఎల్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. త్వరలో ఓవల్‌లో జరగబోతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌ ఫైనల్‌లో (WTC Final) ఆస్ట్రేలియాతో భారత జట్టు తలపడబోతోంది. ఆ మ్యాచ్‌కు గాయపడిన శ్రేయాస్ అయ్యర్ స్థానంలో తనను ఎంపిక చేయక తప్పని పరిస్థితిని సెలక్టర్లకు కల్పించాడు. మరి, సెలక్టర్లు ఏం చేస్తారో చూడాలి.

Updated Date - 2023-04-24T08:41:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising