Viral Video: బౌండరీ లైన్ వద్ద రహానే కళ్లు చెదిరే ఫీల్డింగ్.. సిక్స్‌ను ఎలా ఆపాడో చూడండి..!
ABN, First Publish Date - 2023-04-18T07:56:40+05:30
అటు బ్యాట్‌తో క్లాస్ ఆటకు, ఇటు మైదానంలో కళ్లు చెదిరే ఫీల్డింగ్‌కు అజింక్యా రహానే పెట్టింది పేరు. కొన్ని నెలలుగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న రహానే ఈ ఐపీఎల్ ద్వారా మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు.
అటు బ్యాట్‌తో క్లాస్ ఆటకు, ఇటు మైదానంలో కళ్లు చెదిరే ఫీల్డింగ్‌కు అజింక్యా రహానే (Ajinkya Rahane) పెట్టింది పేరు. కొన్ని నెలలుగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న రహానే ఈ ఐపీఎల్ (IPL 2023) ద్వారా మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. బ్యాట్‌తో మెరుపులు మెరిపిస్తున్నాడు. అలాగే అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. తాజాగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో (RCB) జరిగిన మ్యాచ్‌లో ముందు బ్యాట్‌తో ఆకట్టుకున్నాడు. 20 బంతుల్లో 37 పరుగులు చేశాడు. క్రీజులో ఉన్నంత సేపు ఫోర్లు, సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన బెంగళూరు బ్యాట్స్‌మెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. భారీ సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. చెన్నై బౌలర్ జడేజా వేసిన ఫుల్ లెంగ్త్ బంతిని కూడా భారీ షాట్‌గా మలిచాడు. అయితే బౌండరీ లైన్ వద్ద ఉన్న రహానే గాల్లోకి ఎగిరి ఆ బంతిని ఆపాడు. తను కింద పడే ముందే బంతిని మైదానం లోపలికి విసిరేశాడు. దాంతో ఆరు పరుగులు (Six) రావాల్సింది కాస్తా ఒక్క పరుగే లభించింది. రహానే ఫీల్డింగ్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Surya Kumar Yadav: అటు నాయకుడిగా, ఇటు ఆటగాడిగా సత్తా చాటిన సూర్య.. మ్యాచ్ అనంతరం ఏమన్నాడంటే..
మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై కాన్వే (83), శివమ్ దూబె (52) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 226 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన బెంగళూరుకు పేలవ ఆరంభం లభించింది. స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 6 పరుగులకే వెనుదిరిగాడు. అయితే గ్లెన్ మ్యాక్స్‌వెల్ (76), డుప్లెసిస్ (62) మెరుపు వేగంతో ఆడడంతో బెంగళూరు ఒక దశలో విజయం సాధిస్తుందనిపించింది. చివరకు కేవలం 8 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
Updated Date - 2023-04-18T08:58:29+05:30 IST