ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

GTvsMI: శుభ్‌మన్ గిల్ వికెట్ చూశారా? ఆకాశ్ దెబ్బకు గాల్లోకి ఎగిరిన వికెట్.. వైరల్ అవుతున్న వీడియో!

ABN, First Publish Date - 2023-05-13T09:02:28+05:30

ఐపీఎల్ అత్యంత కీలక దశకు చేరుకుంది. మరో రెండు వారాల్లో విజేత ఎవరో తేలనుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లూ సర్వశక్తులూ కేంద్రీకరించి పోరాడుతున్నాయి. శుక్రవారం రాత్రి ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐపీఎల్ (IPL 2023) అత్యంత కీలక దశకు చేరుకుంది. మరో రెండు వారాల్లో విజేత ఎవరో తేలనుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లూ సర్వశక్తులూ కేంద్రీకరించి పోరాడుతున్నాయి. శుక్రవారం రాత్రి ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి (MIvsGT). వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై టీమ్ బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసి 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. సూర్య కుమార్ యాదవ్ (Suryakumar Yadav) సెంచరీ సాధించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది.

అనంతరం ఛేజింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ (Shubman Gill) క్లీన్ బౌల్డ్ అయి అందరికీ షాకిచ్చాడు. ముంబై బౌలర్ ఆకాశ్ మద్వాల్ (Akash Madhwal) అద్భుతమైన డెలివరీతో గిల్‌కు షాకిచ్చాడు. మద్వాల్ వేసిన నాలుగో ఓవర్ ఐదో బంతిని గిల్ పుల్‌షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ బంతి బౌన్స్‌ను అంచనా వేయడంలో విఫలమయ్యాడు. దీంతో ఆ బంతి గిల్ ఆఫ్-స్టంప్‌ను ఎగరగొట్టింది. దీంతో గిల్ కేవలం 6 పరుగులకే వెనుదిరిగాడు.

Hetmyer: బౌండరీ లైన్ వద్ద హెట్‌మేయర్ అద్భుతం.. వేగంగా పరిగెడుతూ క్యాచ్ ఎలా తీసుకున్నాడో చూడండి..

తొలి నాలుగు ఓవర్లలోనే గుజరాత్ టాపార్డర్ బ్యాట్స్‌మెన్ సాహా (2), గిల్‌ (6), హార్దిక్‌ (4) వికెట్లను కోల్పోవడంతో కష్టాలు మొదలయ్యాయి. విజయ్‌ శంకర్‌ (29) మంచి టచ్‌లో కనిపించినా.. అతడిని పీయూష్‌ అద్భుత బంతితో బౌల్డ్‌ చేశాడు. స్వల్ప వ్యవధిలోనే అభినవ్‌ (2) కూడా అవుటయ్యాడు. చివర్లో రషీద్ ఖాన్ (Rashid Khan) (79 నాటౌట్) అద్భుతంగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది.

Updated Date - 2023-05-13T09:02:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising