ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

SRHvsLSG: నో-బాల్ వివాదం.. కోహ్లీ.. కోహ్లీ.. అంటూ లఖ్‌నవూ జట్టును టీజ్ చేసిన హైదరాబాద్ అభిమానులు!

ABN, First Publish Date - 2023-05-14T10:04:54+05:30

ఈ ఐపీఎల్‌లో తరచుగా నో-బాల్ వివాదాలు చెలరేగుతున్నాయి. నడుము కంటే ఎత్తులో నేరుగా వచ్చే బంతుల విషయంలో అంపైర్లు తీసుకునే నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. నో-బాల్ నిర్ణయంపై డీఆర్‌ఎస్ కోరే అవకాశం ఉండడం కూడా వివాదాలకు కారణమవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ ఐపీఎల్‌ (IPL 2023)లో తరచుగా నో-బాల్ (No-Ball) వివాదాలు చెలరేగుతున్నాయి. నడుము కంటే ఎత్తులో నేరుగా వచ్చే బంతుల విషయంలో అంపైర్లు తీసుకునే నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. నో-బాల్ నిర్ణయంపై డీఆర్‌ఎస్ (DRS) కోరే అవకాశం ఉండడం కూడా వివాదాలకు కారణమవుతోంది. తాజాగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (LSG), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో నెలకొన్న నో-బాల్ వివాదం మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగించింది.

హైదరాబాద్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఆవేశ్ ఖాన్ వేసిన మూడో బంతి హై-ఫుల్ టాస్‌గా వెళ్లింది. ఆ బంతి బ్యాట్స్‌మెన్ నడుము కంటే పై భాగం నుంచి వెళ్లడంతో ఫీల్డ్ అంపైర్లు నో-బాల్ అని ప్రకటించారు. ఆ నిర్ణయాన్ని లఖ్‌నవూ టీమ్ ఛాలెంజ్ చేసింది. ఆ బాల్‌ హై ఫుల్ టాస్ అయినప్పటికీ బ్యాట్ ఎడ్జ్‌కు తగిలింది కాబట్టి అది నో-బాల్ కాదని థర్డ్ అంపైర్ (Thrid Umpire) ప్రకటించారు. ఈ నిర్ణయంపై హైదరాబాద్ ఫ్యాన్స్ (SRH Fans) అసహనం వ్యక్తం చే శారు. థర్డ్ అంపైర్‌ను తిడుతూ హైదరాబాద్ డగౌట్ వైపు బోల్ట్‌లు, నట్లు విసిరారు. దీంతో మ్యాచ్‌కు కాస్త అంతరాయం ఏర్పడింది.

Rashid Khan: రషీద్ ఖాన్‌కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాల్సింది.. ఆల్‌రౌండర్‌పై నెటిజన్ల ప్రశంసలు!

లఖ్‌నవూ టీమ్‌ను టీజ్ చేయడానికి హైదరాబాద్ అభిమానులు ``కోహ్లీ.. కోహ్లీ`` (Virat Kohli) అంటూ కేకలు వేశారు. కోహ్లీతో లక్‌నవూ టీమ్‌కు చెందిన పలువురు ఆటగాళ్లు గతంలో గొడవ పడిన సంగతి తెలిసిందే. దీంతో హైదరాబాద్ ఫ్యాన్స్ ``కోహ్లీ.. కోహ్లీ`` అంటూ కేకలు వేశారు. సోషల్ మీడియాలో కూడా థర్డ్ అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అది చాలా తప్పుడు నిర్ణయమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-05-14T10:04:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising