Boxer Mary Kom : ఆసియా క్రీడలే ఆఖరు
ABN, First Publish Date - 2023-03-14T04:39:49+05:30
ఈ ఏడాది సెప్టెంబరులో జరగనున్న ఆసియా క్రీడలే తన కెరీర్‌లో చివరి టోర్నమెంట్ అని దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ వెల్లడించింది. న్యూఢిల్లీ వేదికగా..

Mary kom
న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబరులో జరగనున్న ఆసియా క్రీడలే తన కెరీర్‌లో చివరి టోర్నమెంట్ అని దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ వెల్లడించింది. న్యూఢిల్లీ వేదికగా ఈనెల 15 నుంచి జరిగే మహిళల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షి్‌పలో పాల్గొనే భారత బాక్సర్ల జెర్సీలను మేరీ సోమవారం ఆవిష్కరించింది. ఈ సందర్భంగా మేరీ మాట్లాడుతూ.. ‘మరో ఐదేళ్లు ఆడే సత్తా నాలో ఉంది కానీ, బాక్సింగ్ నిబంధనల ప్రకారం 40 ఏళ్లు దాటాక పోటీలకు అనుమతి ఉండదు. అందుకే ఆసియా క్రీడల తర్వాత గుడ్‌బై చెబుతా’ అని చెప్పుకొచ్చింది.
Updated Date - 2023-03-14T04:39:54+05:30 IST