Axar Patel’s Six: పంత్ ఎదురుగా అతడి స్టైల్‌లోనే సిక్స్ కొట్టిన అక్షర్ పటేల్.. సింగిల్ హ్యాండ్‌తో భారీ షాట్!
ABN, First Publish Date - 2023-04-05T12:02:17+05:30
రెగ్యులర్ క్రికెటింగ్ షాట్లు కాకుండా కాస్త వెరైటీగా వీర బాదుడు బాదడం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ స్టైల్. అలాంటి షాట్లలో పంత్ కొట్టే సింగిల్ హ్యాండ్ షాట్ ఒకటి.
రెగ్యులర్ క్రికెటింగ్ షాట్లు కాకుండా కాస్త వెరైటీగా వీర బాదుడు బాదడం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant)స్టైల్. అలాంటి షాట్లలో పంత్ కొట్టే సింగిల్ హ్యాండ్ షాట్ ఒకటి. ఒక చేత్తోనే సిక్స్ కొట్టడం (one-handed six) పంత్ ప్రత్యేకత. తాజాగా జరిగిన మ్యాచ్‌లో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel).. పంత్ స్టైల్లోనే ఆ సిక్స్ కొట్టాడు. పంత్ స్టేడియంలో నుంచి చూస్తుండగా అక్షర్ ఆ సిక్స్ కొట్టాడు.
నాలుగు నెలల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిన పంత్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఈ ఐపీఎల్ (IPL 2023)కు దూరమయ్యాడు. అయితే ఢిల్లీలో గురువారం తమ జట్టు ఆడుతున్న మ్యాచ్ (DCvsGT) చూసేందుకు స్టేడియం లోపలికి వచ్చాడు. ఊతకర్ర సహాయంతో స్టేడియంలోకి వచ్చిన పంత్ బీసీసీఐ అధికారులు కూర్చునే గ్యాలరీలో కూర్చుని మ్యాచ్ చూశాడు. ఆ సమయంలో అక్షర్ కొట్టిన సిక్స్ అభిమానులనే కాదు.. పంత్‌ను కూడా ఆకట్టుకుంది.
Sai Sudharsan: ఎవరీ సాయి సుదర్శన్.. క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్యపరిచిన యువ ఆటగాడు.. మాజీల ప్రశంసలు..
మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఇన్నింగ్స్‌లో వార్నర్ మినహా టాపార్డర్ మరోసారి విఫలమైంది. చివరకు 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. వార్నర్ (37), అక్షర్ (36), సర్ఫరాజ్ (30) రాణించారు. యువ బ్యాటర్ సాయి సుదర్శన్ (62 నాటౌట్) నిలకడైన ఆటకు, డేవిడ్ మిల్లర్ (31 నాటౌట్) మెరుపులు తోడవడంతో గుజరాత్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది.
Updated Date - 2023-04-05T12:02:17+05:30 IST