ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL KKR vs RCB : బాదేసిన శార్దూల్‌..

ABN, First Publish Date - 2023-04-07T03:14:58+05:30

తొలి మ్యాచ్‌లో ఓడినా.. సొంతగడ్డపై ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ శార్దూల్‌ ఠాకూర్‌ (29 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 68) సూపర్‌ అర్ధ శతకంతో ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బోణీ చేసింది. గురువారం ఈడెన్‌గార్డెన్స్‌లో

శార్దూల్‌ (29 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 68)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తిప్పేసిన స్పిన్నర్లు

81 పరుగులతో కోల్‌కతా బోణీ

బెంగళూరు ఢమాల్‌

చక్రవర్తికి 4 వికెట్లు

కోల్‌కతా: తొలి మ్యాచ్‌లో ఓడినా.. సొంతగడ్డపై ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ శార్దూల్‌ ఠాకూర్‌ (29 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 68) సూపర్‌ అర్ధ శతకంతో ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బోణీ చేసింది. గురువారం ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 81 పరుగుల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ)ను చిత్తుగా ఓడించింది. తొలుత కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 204 పరుగుల భారీ స్కోరు చేసింది. రహ్మనుల్లా గుర్బాజ్‌ (44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57), రింకూ సింగ్‌ (33 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46) రాణించారు. డేవిడ్‌ విల్లే, కర్ణ్‌ శర్మ చెరో రెండు వికెట్లు దక్కించుకొన్నారు. అనంతరం ఛేదనలో బెంగళూరు 17.4 ఓవర్లలో 123 పరుగులకే కుప్పకూలింది. డుప్లెసి (23), కోహ్లీ (21) టాప్‌ స్కోరర్లు. వరుణ్‌ చక్రవర్తి నాలుగు వికెట్లు పడగొట్టగా..అరంగేట్రం స్పిన్నర్‌ సుయాశ్‌ శర్మకు మూడు, నరైన్‌కు రెండు వికెట్లు లభించాయి.

స్పిన్‌కు దాసోహం..

భారీ లక్ష్య ఛేదనలో మిస్టరీ స్పిన్నర్ల వలలో చిక్కుకొన్న బెంగళూరు విలవిల్లాడింది. 61 పరుగులకే 5 వికెట్లు చేజార్చుకొన్న చాలెంజర్స్‌ ఏదశలోనూ మ్యాచ్‌లోకి రాలేక పోయింది. ఓపెనర్లు కోహ్లీ, డుప్లెసి జట్టుకు అదిరే ఆరంభాన్నిచ్చారు. సౌథీ వేసిన నాలుగో ఓవర్‌లో కోహ్లీ బౌండ్రీ కొట్టగా.. డుప్లెసి రెండు సిక్స్‌లు, ఫోర్‌ బాదడంతో ఆ ఓవర్‌లో మొత్తం 23 పరుగులు వచ్చాయి. అయితే, స్పిన్నర్లు నరైన్‌, వరుణ్‌ చక్రవర్తి ఎంట్రీతో రాయల్‌ చాలెంజర్స్‌ జోరుకు కళ్లెం పడింది. రెండు పరుగుల తేడాతో కోహ్లీ, డుప్లెసిని కోల్పోయిన బెంగళూరు.. క్రమం తప్పకుండా వికెట్లను చేజార్చుకొంటూ ఓటమి దిశగా సాగింది. కోహ్లీని నరైన్‌ బౌల్డ్‌ చేయగా.. డుప్లెసిని చక్రవర్తి పెవిలియన్‌ చేర్చడంతో పవర్‌ప్లే ముగిసే సరికి బెంగళూరు 50/2తో నిలిచింది. మ్యాక్స్‌వెల్‌ (5), హర్షల్‌ పటేల్‌ (0)ను ఒకే ఓవర్‌లో చక్రవర్తి వెనక్కిపంపాడు. షాబాజ్‌ (1)ను నరైన్‌ బోల్తా కొట్టించగా.. బ్రేస్‌వెల్‌ (19)ను శార్దూల్‌ క్యాచవుట్‌ చేశాడు. అనూజ్‌ (1), దినేష్‌ కార్తీక్‌ (9), కర్ణ్‌ శర్మ (1)ను ఇంపాక్ట్‌ ప్లేయర్‌ సుయాశ్‌ శర్మ వెనక్కిపంపగా.. విల్లే (20 నాటౌట్‌), ఆకాష్‌ (17) ఆఖరి వికెట్‌కు 27 పరుగులతో ఓటమి అంతరాన్ని తగ్గించారు. ఆ కాష్‌ను అవుట్‌ చేసిన చక్రవర్తి బెంగళూరు ఇన్నింగ్స్‌కు తెరదించాడు.

చెలరేగిన శార్దూల్‌

శార్దూల్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో కోల్‌కతా అనూహ్యంగా భారీ స్కోరు చేసింది. బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడిన ఠాకూర్‌.. ఎడాపెడా షాట్లతో స్కోరు బోర్డును దౌడు తీయించాడు. రింకూతో కలసి ఠాకూర్‌ ఆరో వికెట్‌కు 47 బంతుల్లో 103 పరుగులు జోడించడంతో నైట్‌రైడర్స్‌ రెండొందల మార్క్‌కు చేరింది. టాస్‌ కోల్పోయి బ్యాటింగ్‌కు దిగిన నైట్‌రైడర్స్‌ ఆరంభంలో తడబడింది. ఓపెనర్‌ వెంకటేష్‌ అయ్యర్‌ (3), మన్‌దీ్‌ప (0)ను నాలుగో ఓవర్‌లో విల్లే వరుస బంతుల్లో అవుట్‌ చేసి షాకివ్వగా.. పవర్‌ప్లే ముగిసిన వెంటనే కెప్టెన్‌ నితీశ్‌ రాణా (1)ను బ్రేస్‌వెల్‌ క్యాచవుట్‌ చేయడంతో కోల్‌కతా 47/3తో కష్టాల్లో పడినట్టు కనిపించింది. కానీ, మరో ఓపెనర్‌ గుర్బాజ్‌.. రింకూతో కలసి నాలుగో వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొనే ప్రయత్నం చేశాడు. అయితే, 11వ ఓవర్‌లో గుర్బాజ్‌ను, అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన రస్సెల్‌ (0)ను కర్ణ్‌ శర్మ అవుట్‌ చేశాడు. ఈ దశలో రింకూకు శార్దూల్‌ జతకలవడంతో సీన్‌ మొత్తం మారిపోయింది. ఆకాష్‌ వేసిన 13వ ఓవర్‌లో శార్దూల్‌ రెండు ఫోర్లు, సిక్స్‌తో 19 పరుగులు రాబట్టడంతో.. నైట్‌రైడర్స్‌ 113/5తో నిలిచింది. ఆ తర్వాత 15వ ఓవర్లో వరుసగా మరో రెండు సిక్స్‌లు కొట్టాడు. ఆనక రెండు ఫోర్లు బాదిన శార్దూల్‌.. కేవలం 20 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకొన్నాడు. 19వ ఓవర్‌లో హర్షల్‌ బౌలింగ్‌లో ఫోర్‌, రెండు సిక్స్‌లతో 17 పరుగులు రాబట్టిన రింకూ ఆఖరి బంతికి క్యాచవుటయ్యాడు. చివరి ఓవర్‌లో శార్దూల్‌ వెనుదిరిగినా.. ఉమేష్‌ (6 నాటౌట్‌) ఫోర్‌తో జట్టుకు డబుల్‌ సెంచరీ స్కోరును అందించాడు.

స్కోరుబోర్డు

కోల్‌కతా: గుర్బాజ్‌ (సి) ఆకాశ్‌దీ్‌ప (బి) కర్ణ్‌ శర్మ 57, వెంకటేశ్‌ అయ్యర్‌ (బి) విల్లే 3, మన్‌దీ్‌ప (బి) విల్లే 0, నితీశ్‌ రాణా (సి) కార్తీక్‌ (బి) బ్రేస్‌వెల్‌ 1, రింకూ సింగ్‌ (సి) కార్తీక్‌ (బి) హర్షల్‌ 46, రస్సెల్‌ (సి) కోహ్లీ (బి) కర్ణ్‌ శర్మ 0, శార్దూల్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) సిరాజ్‌ 68, నరైన్‌ (నాటౌట్‌) 0, ఉమేశ్‌ (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు 23, మొత్తం: 20 ఓవర్లలో 204/7; వికెట్ల పతనం:1-26, 2-26, 3-47, 4-89, 5-89, 6-192, 7-198; బౌలింగ్‌: సిరాజ్‌ 4-0-44-1, విల్లే 4-1-16-2, ఆకాశ్‌దీ్‌ప 2-0-30-0, బ్రేస్‌వెల్‌ 3-0-34-1, షాబాజ్‌ 1-0-6-0, కర్ణ్‌ శర్మ 3-0-26-2, హర్షల్‌ పటేల్‌ 3-0-38-1.

బెంగళూరు: కోహ్లీ (బి) నరైన్‌ 21, డుప్లెసి (బి) వరుణ్‌ 23, బ్రేస్‌వెల్‌ (సి) రాణా (బి) శార్దూల్‌ 19, మ్యాక్స్‌వెల్‌ (బి) వరుణ్‌ 5, హర్షల్‌ (బి) వరుణ్‌ 0, షాబాజ్‌ (సి) శార్దూల్‌ (బి) నరైన్‌ 1, కార్తీక్‌ (సి) వరుణ్‌ (బి) సుయాశ్‌ 9, అనూజ్‌ (సి) నరైన్‌ (బి) సుయాశ్‌ 1, విల్లే (నాటౌట్‌) 20, కర్ణ్‌ శర్మ (సి) రాణా (బి) సుయాశ్‌ 1, ఆకాశ్‌దీ్‌ప (సి) అండ్‌ (బి) వరుణ్‌ 17, ఎక్స్‌ట్రాలు 6, మొత్తం: 17.4 ఓవర్లలో 123 ఆలౌట్‌; వికెట్లపతనం: 1-44, 2-46, 3-54, 4-54, 5-61, 6-83, 7-84, 8-86, 9-96; బౌలింగ్‌: ఉమేశ్‌ 2-0-17-0, సౌథీ 2-0-25-0, నరైన్‌ 4-0-16-2, వరుణ్‌ 3.4-0-15-4, సుయాశ్‌ 4-0-30-3, శార్దూల్‌ 2-0-15-1.

Updated Date - 2023-04-07T03:15:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising