Rishab Pant Jersey: డగౌట్‌పై రిషబ్ పంత్ జెర్సీ.. ఢిల్లీ టీమ్‌పై బీసీసీఐ ఆగ్రహం.. కారణమేంటంటే..
ABN, First Publish Date - 2023-04-04T13:06:40+05:30
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో ప్రస్తుత ఐపీఎల్‌కు టీమిండియా క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ దూరమయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఢిల్లీ జట్టుకు నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో ప్రస్తుత ఐపీఎల్‌కు (IPL 2023) టీమిండియా క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) దూరమయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) ఢిల్లీ జట్టుకు నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. అయితే లఖ్‌నవూతో ఆడిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ టీమ్ పంత్ జ్ఞాపకార్థం అతడి జెర్సీని (Rishab Pant Jersey) తమ డౌగట్కు తగిలించింది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయంపై బీసీసీఐ (BCCI) ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
``ఒక ఆటగాడి జెర్సీని అలా డగౌట్‌కు వేలాడదీయడం చాలా తీవ్రమైన చర్య. ఇలాంటి పనులు ఆటగాడు రిటైర్ అయినపుడు లేదా మరణించినపుడు మాత్రమే చేస్తారు. పంత్ ప్రస్తుతం చాలా వేగంగా కోలుకుంటున్నాడు. త్వరలోనే మైదానంలో అడుగుపెడతాడు. ఢిల్లీ టీమ్ మంచి ఆలోచనతోనే అలా చేసినప్పటికీ అది తప్పు అర్థం వచ్చేలా ఉంది. ఇకపై అలా చేయవద్ద``ని ఢిల్లీ టీమ్‌ను బీసీసీఐ ప్రతినిధి హెచ్చరించినట్టు సమాచారం.
Shah Rukh Khan: కోల్‌కతా జట్టు కోసం మైదానంలోకి షారూక్.. బాద్ షా రాకతో కోల్‌కతా గేరు మారుస్తుందా?
కాగా, ఢిల్లీలోని హోమ్ గ్రౌండ్లో ఈ రోజు (మంగళవారం) జరిగే మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో ఢిల్లీ టీమ్ తలపడనుంది (DCvsGT). ఈ మ్యాచ్ వీక్షించేందుకు పంత్ స్వయంగా స్టేడియంకు రానున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ పాలకమండలి అనుమతిస్తే డగౌట్లో ఆటగాళ్లతో పంత్ మాట్లాడనున్నాడట. గతేడాది డిసెంబర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ అప్పట్నుంచి ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే.
Updated Date - 2023-04-04T13:06:40+05:30 IST