ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

స్విమ్మర్‌ వ్రితికి కాంస్యం

ABN, First Publish Date - 2023-10-30T02:20:30+05:30

జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతాలో 8వ పతకం చేరింది. గోవాలో జరుగుతున్న ఈ పోటీల్లో...

జాతీయ క్రీడలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతాలో 8వ పతకం చేరింది. గోవాలో జరుగుతున్న ఈ పోటీల్లో ఆదివారం ముగిసిన మహిళల ఈత పోటీల్లో హైదరాబాద్‌ స్విమ్మర్‌ వ్రితి అగర్వాల్‌ కాంస్య పతకం కొల్లగొట్టింది. 200 మీటర్ల ఫ్రీస్టయిల్‌ ఈవెంట్‌లో వ్రితి 2 నిమిషాల 9 సెకన్లలో రేసును ముగించి, తృతీయ స్థానంలో నిలిచింది. ధీనిధి (కర్ణాటక) స్వర్ణం, సంజన (గోవా) రజతం సొంతం చేసుకున్నారు. ఇక, 15 రెడ్‌ స్నూకర్‌లో తెలంగాణ ప్లేయర్‌ ముస్తాక్‌ ఖాన్‌ సెమీఫైనల్లో ప్రవేశించాడు. క్వార్టర్స్‌ పోరులో ముస్తాక్‌ 3-2తో స్పర్శ్‌ ఫెర్వాణి (మహారాష్ట్ర)పై గెలిచాడు. సోమవారం జరగనున్న సెమీస్‌లో అను జుప్పాల్‌ (న్యూఢిల్లీ)తో ముస్తాక్‌ తలపడనున్నాడు.

Updated Date - 2023-10-30T02:20:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising