MS Dhoni: ధోనీ కోసం ఎదురుచూపులు.. జడేజా అవుట్ అయినప్పుడు పండగ చేసుకున్న చెన్నై ఫ్యాన్స్!
ABN, First Publish Date - 2023-05-15T10:57:23+05:30
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినా ధోనీకి అభిమాన గణం తగ్గలేదు. ప్రస్తుత ఐపీఎల్‌లో భాగంగా ధోనీ ఏ నగరానికి వెళ్తున్నా స్థానిక టీమ్‌కు కాకుండా ధోనీకే అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు.
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి (MS Dhoni) దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినా ధోనీకి అభిమాన గణం తగ్గలేదు. ప్రస్తుత ఐపీఎల్‌లో (IPL 2023) భాగంగా ధోనీ ఏ నగరానికి వెళ్తున్నా స్థానిక టీమ్‌కు కాకుండా ధోనీకే అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. ఇతరులతో పోలిస్తే తమిళులకు ధోనీ మరింత ఆప్తుడు. ఐపీఎల్ ఆరంభం నుంచి చెన్నై టీమ్‌ను (CSK) ధోనీయే నడిపిస్తున్నాడు. తమిళనాడులోని సామాన్యులే కాదు.. సినీ ప్రముఖులు, సీఎం స్టాలిన్‌తో సహా అందరూ ధోనీని అభిమానిస్తున్నారు.
ఆదివారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో చెన్నై టీమ్ తలపడింది (KKRvsCSK). ఈ మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్ చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. తొలుత చెన్నై టీమ్ బ్యాటింగ్ చేసింది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 20 పరుగులు చేసి వైభవ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. జడేజా అవుటైనపుడు చెన్నై ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఎందుకంటే జడేజా అవుటయ్యాక ధోనీ బ్యాటింగ్‌కు వస్తాడు కాబట్టి. ధోనీ మైదానంలో అడుగుపెడుతున్నప్పుడు అభిమానులందరూ ``ధోనీ.. ధోనీ..`` అంటూ కేకలు వేశారు.
Yashaswi Jaiswal: ``కింగ్``తో నయా సూపర్ స్టార్.. విరాట్ కోహ్లీ నుంచి సలహాలు తీసుకున్న యశస్వి జైస్వాల్!
చివరి ఓవర్లో బ్యాటింగ్‌కు దిగిన ధోనీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కోల్‌కతా బౌలర్ వైభవ్ అరోరా అద్భుత యార్కర్లతో ధోనీని కట్టడి చేశాడు. దీంతో ధోనీ 2 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో చెన్నైపై కోల్‌కతా టీమ్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 144 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేదనలో కోల్‌కతా 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 147 పరుగులు చేసి నెగ్గింది. నితీశ్ రాణా (57 నాటౌట్), రింకూ సింగ్ (54) హాఫ్ సెంచరీలు సాధించారు.
Updated Date - 2023-05-15T10:57:23+05:30 IST