ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చోప్రా చమక్‌

ABN, First Publish Date - 2023-07-02T02:52:57+05:30

ఒలింపిక్‌ చాంపియన్‌ నీరజ్‌ చోప్రా ప్రతిష్ఠాత్మక డైమండ్‌ లీగ్‌లో దూసుకుపోతున్నాడు. వరుసగా రెండోసారీ జావెలిన్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. డైమండ్‌ లీగ్‌లో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి జరిగిన లొజానె లెగ్‌లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత స్టార్‌దే ‘లొజానె’ టైటిల్‌

లాంగ్‌జం్‌పలో మురళీకి ఐదో స్థానం

లొజానె: ఒలింపిక్‌ చాంపియన్‌ నీరజ్‌ చోప్రా ప్రతిష్ఠాత్మక డైమండ్‌ లీగ్‌లో దూసుకుపోతున్నాడు. వరుసగా రెండోసారీ జావెలిన్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. డైమండ్‌ లీగ్‌లో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి జరిగిన లొజానె లెగ్‌లో 87.66 మీటర్ల దూరం ఈటెను విసిరిన భారత స్టార్‌ స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. కండర గాయంతో నెలరోజులు ఆటకు దూరంగా ఉన్న నీరజ్‌ పునరాగమనంలో అదరగొట్టాడు. గత నెలలో గాయపడిన 25 ఏళ్ల నీరజ్‌ డైమండ్‌ లీగ్‌లో మూడు టాప్‌ ఈవెంట్లకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక..మే ఐదున దోహాలో జరిగిన డైమండ్‌ లీగ్‌ తొలి అంచె పోటీలో పసిడి పతకంతో అతడు సీజన్‌ను ఘనంగా ఆరంభించాడు. ‘గాయం తర్వాత బరిలో దిగడంతో ఒకింత ఉత్కంఠకు లోనయ్యా. అయినా సాధించా. లొజానె నాకెప్పుడూ కలిసివచ్చే వేదిక’ అని నీరజ్‌ చెప్పాడు. కాగా..లొజానెలో విజేతగా నిలిచిన చోప్రాను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. జర్మనీకి చెందిన జులియన్‌ వెబర్‌ 87.03 మీ. దూరంతో రెండో స్థానంలో నిలిచాడు. టోక్యో ఒలింపిక్స్‌ రజత పతక విజేత జాకబ్‌ వాడ్లేచ్‌ (చెక్‌ రిపబ్లిక్‌) 86.13 మీ.తో మూడో స్థానం దక్కించుకున్నాడు. పురుషుల లాంగ్‌జం్‌పలో భారత్‌కు చెందిన మురళీ శ్రీశంకర్‌ (7.88 మీ) ఐదో స్థానంతో నిరాశ పరిచాడు. లకాన్‌ నెయిర్న్‌ (బహమాస్‌, 8.11 మీ.) స్వర్ణం, ఒలింపిక్‌ చాంపియన్‌ టెంటోగ్లో (గ్రీస్‌, 8.07 మీ) రజతం, హషియోక (జపాన్‌, 7.98 మీ.) కాంస్య పతకాలు నెగ్గారు.

Updated Date - 2023-07-02T02:52:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising