ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2023: తొలి బంతికే కోహ్లీ అవుటైనా.. డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ దంచికొట్టారు!

ABN, First Publish Date - 2023-04-23T18:26:19+05:30

రాజస్థాన్ రాయల్స్‌(RR)తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RR) భారీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: రాజస్థాన్ రాయల్స్‌(RR)తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RR) భారీ స్కోరు సాధించింది. ఇన్నింగ్స్ తొలి బంతికే స్టాండిన్ కెప్టెన్ కోహ్లీ(Virat Kohli) గోల్డెన్ అయినా డుప్లెసిస్(Du Plessis), మ్యాక్స్‌వెల్ (Maxwell) చెలరేగిపోవడంతో బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.

టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన బెంగళూరుకు తొలి బంతికే షాక్ తగిలింది. బౌల్ట్ సంధించిన తొలి ఓవర్ తొలి బంతికే కోహ్లీ వికెట్ల ముందు దొరికిపోయి గోల్డెన్ డక్ అయ్యాడు. అయితే, ఇంపాక్ట్ ప్లేయర్‌గా క్రీజులోకి వచ్చిన డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ రాజస్థాన్ బౌలర్లపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. బౌలర్లను ఉతికి ఆరేశారు.

డుప్లెసిస్ 39 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 62, మ్యాక్స్‌వెల్ 44 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు చేయడంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. అయితే, వారిద్దరూ అవుటైన తర్వాత వికెట్లు టపటపా రాలిపోయాయి. క్రీజులోకి వచ్చినవారు వచ్చినట్టే వెనుదిరగడంతో 200 దాటుతుందనుకున్న స్కోరు 189 పరుగులకే పరిమితమైంది. మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్ తర్వాత దినేశ్ కార్తీక్ చేసిన 16 పరుగులే మూడో అత్యధికం. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, సందీశ్ శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

Updated Date - 2023-04-23T18:26:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising