IPL 2023: ఢిల్లీ ఢమాల్.. రెండు పరుగులకే మూడు వికెట్లు డౌన్!
ABN, First Publish Date - 2023-04-15T17:52:53+05:30
ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఘోర పరాభవాలు మూటగట్టుకున్న ఢిల్లీ కేపిటల్స్(DC)
బెంగళూరు: ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఘోర పరాభవాలు మూటగట్టుకున్న ఢిల్లీ కేపిటల్స్(DC) మరో పరాజయం దిశగా అడుగులు వేస్తోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)తో జరుగుతున్న మ్యాచ్‌లో రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
తొలుత బెంగళూరును 174 పరుగులకే కట్టడి చేసిన ఢిల్లీకి ఆ ఆనందం ఎంతో సేపు మిగల్లేదు. 175 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఢిల్లీకి తొలి మూడు ఓవర్లలోనే ఒకదానివెంట ఒకటిగా షాకులు తగిలాయి. తొలి ఓవర్ నాలుగో బంతికి పృథ్వీషా డకౌట్ కాగా, రెండో ఓవర్ నాలుగో బంతికి మిచెల్ మార్ష్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మూడో ఓవర్ రెండో బంతికి యశ్ ధుల్ (1) అవుటయ్యాడు.
అప్పటికి ఆ జట్టు స్కోరు రెండు పరుగులే. ప్రస్తుతం నాలుగు ఓవర్లు ముగిశాయి. ఢిల్లీ మూడు వికెట్ల నష్టానికి 12 పరుగులు చేసింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్, మనీష్ పాండే క్రీజులో ఉన్నారు.
Updated Date - 2023-04-15T17:52:53+05:30 IST