ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2023: గుజరాత్‌ను భలేగా కట్టడి చేసిన లక్నో బౌలర్లు.. స్వల్ప లక్ష్యాన్ని రాహుల్ సేన ఊదేస్తుందా?

ABN, First Publish Date - 2023-04-22T17:29:22+05:30

గుజరాత్(GT)-లక్నో(LSG) మధ్య జరుగుతున్న మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందనుకుంటే అలా ఏమీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: గుజరాత్(GT)-లక్నో(LSG) మధ్య జరుగుతున్న మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందనుకుంటే అలా ఏమీ కనిపించడం లేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నపాండ్యా(Hardik Pandya) సేన పరుగులు పిండుకోలేకపోయింది. లక్నో బౌలర్ల పదునైన బంతుల నుంచి పరుగులు రాబట్టుకోలేకపోయిన బ్యాటర్లు క్రమం తప్పకుండా పెవిలియన్ చేరారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి గుజరాత్ 135 పరుగులు మాత్రమే చేసి ప్రత్యర్థికి స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.

లక్నో బౌలర్లు నవీన్ ఉల్ హక్, కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్ ఈ మ్యాచ్‌లో ఉత్తమ గణాంకాలు నమోదు చేశారు. పరుగుల విషయంలో పొదుపు పాటిస్తూనే క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ గుజరాత్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశారు. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా 50 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 66 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవగా ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 37 బంతుల్లో 6 ఫోర్లతో 47 పరుగులు చేశారు. గిల్ డకౌట్ కాగా, అభినవ్ మనోహర్ 3, విజయ్ శంకర్ 10, డేవిడ్ మిల్లర్ 6 పరుగులు చేశారు. తెవాటియా 2 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్ చెరో రెండు వికెట్లు తీసుకోగా, నవీన్ ఉల్ హక్, అమిత్ మిశ్రా చెరో వికెట్ తీసుకున్నారు.

Updated Date - 2023-04-22T17:29:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising