IPL2023: ఐపీఎల్ టికెట్స్ కావాలా? ఆన్‌లైన్‌లో ఇలా బుక్ చేసుకోండి!
ABN, First Publish Date - 2023-04-02T20:41:38+05:30
మీరు ఐపీఎల్(IPL 2023) ప్రియులా? స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్‌లను వీక్షించాలనుకుంటున్నారా? అయితే, ఈ సమాచారం మీకోసమే
న్యూఢిల్లీ: మీరు ఐపీఎల్(IPL 2023) ప్రియులా? స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్‌లను వీక్షించాలనుకుంటున్నారా? అయితే, ఈ సమాచారం మీకోసమే. గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)-చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) మధ్య మ్యాచ్‌తో మొదలైన ఈ సీజన్ మరింత వినోదాన్ని అందించబోతోంది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో కొన్ని పొట్టి ఫార్మాట్‌లోని అసలైన మజాను అందించాయి. మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించే వారితో స్టేడియంలోని గ్యాలరీలు కిక్కిరిసిపోతున్నాయి. మీరు కూడా మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడాలని అనుకుంటున్నారా? టికెట్లు తీసుకోవడమెలానో తెలియక ఇబ్బంది పడుతున్నారా? అయితే, ఇది మీకోసమే.
టికెట్లను ఇలా కొనుక్కోవచ్చు
ఐపీఎల్ టికెట్ల ధరలు ఆయా వేదికలను బట్టి వేర్వేరుగా ఉంటాయి. కనీస ధ రూ. 400 కాగా, అదనపు సౌకర్యాలతో కూడిన ప్రీమియం టికెట్ ధర రూ. 2,500. చాలా ఫ్రాంచైజీలు వేదికల వద్ద కూడా టికెట్లను విక్రయిస్తున్నాయి. అక్కడ నేరుగా కూడా కొనుగోలు చేసుకోవచ్చు. కొన్ని ఫ్రాంచైజీలు తమ అధికారిక వెబ్‌సైట్ ద్వారా టికెట్లు విక్రయిస్తున్నాయి. ఇంకొన్ని ఫ్రాంచైజీలు బుక్‌మై షో, పేటీఎం ఇన్‌సైడర్ ద్వారా టికెట్లను అమ్ముతున్నాయి.
గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల టికెట్లను పేటీఎం ఇన్‌సైడర్ ద్వారా, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ టికెట్లను బుక్‌మై షో ద్వారా రిజర్వు చేసుకోవచ్చు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ కేపిటల్స్ తమ వెబ్‌సైట్ల ద్వారా కూడా టికెట్లను విక్రయిస్తున్నాయి. అదే సమయంలో స్టేడియంలు ఆహారం, ఇతర ఆతిథ్య సేవలు సహా వివిధ టికెట్ స్థాయులను ఆఫర్ చేస్తున్నాయి. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసుకోలేని వారు నేరుగా స్టేడియం బాక్స్ ఆఫీస్‌లో కొనుగోలు చేయవచ్చు.
Updated Date - 2023-04-02T20:43:31+05:30 IST