IPL 2023: ప్లే ఆఫ్స్‌కు చేరే జట్లు ఇవే..
ABN, First Publish Date - 2023-05-11T19:52:44+05:30
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో లీగ్ మ్యాచ్‌లు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. ప్రస్తుతానికి డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో లీగ్ మ్యాచ్‌లు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. ప్రస్తుతానికి డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్టు మెరుగైన స్థితిలో ఉంది. మిగిలిన జట్లలో కొన్ని రేసులో నిలవగా, అట్టడుగున ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ కేపిటల్స్ కూడా రేసులోకి రావాలని పట్టుదలగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోటీలో ఉన్న పది జట్ల పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం.
గుజరాత్ టైటాన్స్
హార్దిక్ పాండ్యా సారథ్యంలో గుజరాత్ టైటాన్స్ జట్టు ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడి 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. దాదాపు ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నట్టే. మిగతా మూడు మ్యాచుల్లో ఓడితే మాత్రం ఆ జట్టు నాలుగో స్థానానికి పడిపోయే అవకాశం ఉంది. అయితే, ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించినా ఆ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయమవుతుంది.
చెన్నై సూపర్ కింగ్స్
మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni) సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కూడా మెరుగైన స్థితిలోనే ఉంది. ఢిల్లీ కేపిటల్స్ (DC)తో జరిగిన మ్యాచ్ తర్వాత ఆ జట్టు ఏకంగా రెండో స్థానానికి ఎగబాకింది. ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే ఏడింటిలో విజయం సాధించి 15 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్‌లో చోటుకు ఆ జట్టుకు మరొక్క విజయం చాలు. ఈ నేపథ్యంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR)తో జరగనున్న మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా బెర్త్ ఖరారు చేసుకోవాలని పట్టుదలగా ఉంది.
ముంబై ఇండియన్స్
ఐదుసార్లు ట్రోఫీ అందుకున్న రోహిత్ శర్మ (Rohit Sharma) సారథ్యంలోని ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఈ సీజన్‌ను చాలా దారుణంగా ప్రారంభించింది. పడుతూ లేస్తూ వచ్చిన జట్టు ఆ తర్వాత బ్రహ్మాండంగా పుంజుకుంది. మంగళవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత ఆ జట్టు ఖాతాలో 12 పాయింట్లు వచ్చి చేరాయి. ముంబై ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మరో రెండింటిలో విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ ఖాయం. అయితే, మైనస్‌లలో ఉన్న రన్‌రేట్‌ను ఆ జట్టు మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. మిగతా మూడు మ్యాచుల్లోనూ నెగ్గితే ఆ జట్టు టాప్-2లోకి చేరుకుంటుంది.
లక్నో సూపర్ జెయింట్స్
బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై విజయం సాధించడంతో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఈక్వేషన్స్ విషయంలో క్లారిటీ వచ్చింది. 11 మ్యాచుల్లో 11 పాయింట్లు సాధించిన లక్నో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. రన్‌రేట్ కూడా బాగానే ఉంది. ప్లే ఆఫ్స్‌కి క్వాలిఫై కావాలంటే మిగతా మూడు మ్యాచుల్లోనూ విజయం సాధించాల్సి ఉంటుంది. ఒక్క మ్యాచ్‌లో ఓడినా ఆ జట్టు అవకాశాలు దెబ్బతింటాయి. అయితే, ఇతర జట్ల ఫలితాలు, నెట్‌రేట్ బట్టి కూడా ఆ జట్టుకు కొంత వరకు అవకాశాలున్నాయి.
రాజస్థాన్ రాయల్స్
రాజస్థాన్ రాయల్స్ (RR) తన తర్వాతి మ్యాచ్‌లను కేకేఆర్, ఆర్సీబీ, పంజాబ్‌తో ఆడనుంది. ఆ మూడింటిలోనూ గెలిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలకు తిరుగుండదు. అయితే, ఈ క్రమంలో ప్రత్యర్థులు కూడా కొన్ని మ్యాచుల్లో ఓడిపోతే ఇక ఆ జట్టు అవకాశాలను ఎవరూ అడ్డుకోలేరు. నెట్ రన్‌రేట్ ప్లస్‌లలో ఉండడం కూడా ఆ జట్టుకు కలిసొచ్చే అంశం అవుతుంది.
కోల్‌కతా నైట్ రైడర్స్
ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) 10 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. అయితే, రన్‌రేట్ మాత్రం మైనస్‌లలో ఉంది. ఇకపై ఆ జట్టు ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ విజయం సాధించాల్సి ఉంటుంది. అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించినా నెట్ రన్‌రేట్ కీలకంగా మారే అవకాశం ఉంది. అయితే, భారీ తేడాలతో విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ కష్టం కాకపోవచ్చు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
డుప్లెసిస్ సేన కూడా మిగతా మూడు మ్యాచుల్లోనూ విజయం సాధిస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. అయితే, బెంగళూరు (RCB) రన్‌రేట్ కూడా మైనస్‌లలో ఉంది. ప్లే ఆఫ్స్ అవకాశాలు ఈ జట్టుకు కూడా కష్టమే. మిగతా మ్యాచులన్నింటిలోనూ విజయం సాధిస్తే ఆ జట్టు స్కోరు 16 పాయింట్లకు చేరుకుంటుంది. అయితే, అప్పుడు కూడా నెట్ రన్‌రేట్ కీలకంగా మారుతుంది. అయితే, ఆర్సీబీ తన చివరి మూడు మ్యాచ్‌లను సొంత మైదానానికి దూరంగా ఆడడనుండడం కొంత ఇబ్బంది కరమే.
పంజాబ్ కింగ్స్
పంజాబ్ కింగ్స్ (PBKS) పరిస్థితి కూడా కోల్‌కతా నైట్ రైడర్స్ లాంటిదే. పంజాబ్ తన చివరి మూడు మ్యాచుల్లోనూ విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ రేసులోకి వస్తుంది. ప్రస్తుతం ఆ జట్టు 11 మ్యాచుల్లో 10 పాయింట్లతో ఉంది. దీనికి కూడా నెట్ రన్‌రేట్ సమస్యగా మారింది. అయితే, చివరి మూడు మ్యాచుల్లో రెండు సొంత మైదానంలో జరగనుండడం దానికి కలిసొచ్చే అంశం.
సన్ రైజర్స్ హైదరాబాద్
10 మ్యాచుల్లో 8 పాయింట్లతో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)కు ఇంకా నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. అన్ని మ్యాచుల్లోనూ గెలిస్తే ఆ జట్టు స్కోరు 16 పాయింట్లకు చేరుకుంటుంది. రన్‌రేట్ సమస్య ఈ జట్టును కూడా వెంటాడుతోంది. దీనికి తోడు మిగతా మ్యాచుల్లో ప్రత్యర్థులు బలమైన వారు కావడం హైదరాబాద్ తీవ్రంగా పోరాడాల్సి ఉంటుంది.
ఢిల్లీ కేపిటల్స్
పాయింట్ల పట్టికలో అట్టడుగున వార్నర్ సారథ్యంలోని ఢిల్లీ కేపిటల్స్ (DC) జట్టుకు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. అన్ని మ్యాచుల్లోనూ గెలిచినా ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడాల్సి ఉంటుంది. చెన్నైతో ఓడిపోవడం ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరితే కనుక అది అద్భుతమో అవుతుంది.
Updated Date - 2023-05-11T20:31:17+05:30 IST