IPL 2023: టాస్ గెలిచిన పంజాబ్.. బెంగళూరు కెప్టెన్‌గా కోహ్లీ
ABN, First Publish Date - 2023-04-20T15:24:56+05:30
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో భాగంగా నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి.
మొహాలీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో భాగంగా నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మరికాసేపట్లో ప్రారంభం కానున్న తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్(PBKS)-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్లు తలపడనుండగా, సాయంత్రం ఏడున్నర గంటలకు ఢిల్లీ కేపిటల్స్(DC)-కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) జట్లు ఢిల్లీలో తలపడనున్నాయి.
బెంగళూరుపై టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై విజయం సాధించిన పంజాబ్ ఈ మ్యాచ్‌లోనూ గెలుపుపై దృష్టిసారించింది. ఇక, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ చివరి వరకు పోరాడి ఓడింది.
ఆర్సీబీతో జరిగిన చివరి ఆరు మ్యాచుల్లో పంజాబ్ ఐదుసార్లు విజయం సాధించింది. దీంతో ఆ రికార్డును పదిలపరుచుకోవాలని పంజాబ్ యోచిస్తోంది. ఇక, ఆర్సీబీ బౌలింగ్ విషయంలో బాగా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. మహమ్మద్ సిరాజ్ తప్ప ఆ జట్టులో పెద్దగా ఎవరూ ప్రభావం చూపలేకపోతున్నారు.
ఇక, బెంగళూరుకు ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సారథ్యం వహిస్తున్నాడు. డుప్లెసిస్ గాయం కారణంగా జట్టు నుంచి తప్పుకోవడంతో కోహ్లీకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అయితే, ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రం బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. అలాగే, పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధవన్ ఈ మ్యాచ్‌కు కూడా అందుబాటులో లేకపోవడంతో శామ్ కరన్ జట్టుకు సారథ్యం వహిస్తున్నారు. పంజాబ్ జట్టులోకి లివింగ్ స్టోన్, నాథన్ ఎల్లిస్ తిరిగి జట్టులోకి వచ్చేశారు.
Updated Date - 2023-04-20T15:24:56+05:30 IST