IPL 2023: రెండు వికెట్లు కోల్పోయిన పంజాబ్.. అర్జున్‌ ఖాతాలో రెండో వికెట్

ABN, First Publish Date - 2023-04-22T20:10:39+05:30

ఐపీఎల్‌ (IPL 2023)లో భాగంగా ముంబై ఇండియన్స్‌(Mumbai Indians)తో

IPL 2023: రెండు వికెట్లు కోల్పోయిన పంజాబ్.. అర్జున్‌ ఖాతాలో రెండో వికెట్
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ఐపీఎల్‌ (IPL 2023)లో భాగంగా ముంబై ఇండియన్స్‌(Mumbai Indians)తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌(Punjab Kings)కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కేమరాన్ గ్రీన్ వేసిన మూడో ఓవర్ మూడో బంతికి ఓపెనర్ మాథ్యూ షార్ట్ అవుటయ్యాడు. 10 బంతుల్లో రెండు ఫోర్లతో 11 పరుగులు చేసిన షార్ట్ తొలి వికెట్‌గా అవుటయ్యాడు.

ఆ తర్వాత వచ్చిన అథర్వతో కలిసి నిలకడగా ఆడిన ప్రభ్‌సిమ్రన్ సింగ్.. అర్జున్ టెండూల్కర్ బౌలింగులో రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఐపీఎల్‌లో అర్జున్‌కు ఇది రెండో వికెట్. 17 బంతులు ఆడిన ప్రభ్‌సిమ్రన్ ఫోర్, రెండు సిక్సర్లతో 26 పరుగులు చేశాడు. ప్రస్తుతం 7 ఓవర్లు ముగిశాయి. పంజాబ్ రెండు వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. లివింగ్ స్టోన్ (1), అథర్వ (28) క్రీజులో ఉన్నారు.

Updated Date - 2023-04-22T20:16:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising