ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2023: చాహల్ దెబ్బకు కేకేఆర్ విలవిల.. రాజస్థాన్ ఎదుట ఓ మాదిరి లక్ష్యం

ABN, First Publish Date - 2023-05-11T21:46:47+05:30

రాజస్థాన్ రాయల్స్‌ (RR)తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) 20 ఓవర్లలో 8 వికెట్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: రాజస్థాన్ రాయల్స్‌ (RR)తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. 29 పరుగులకే జాసన్ రాయ్ (10), గుర్బాజ్ (18) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కోల్‌కతాను ఆ తర్వాత వెంకటేశ్ అయ్యర్ ఆదుకునే ప్రయత్నం చేశాడు. 42 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

కెప్టెన్ నితీశ్ రాణా (22) మరోమారు నిరాశ పరిచాడు. మెరుపులు మెరిపిస్తాడనుకున్న రింకు సింగ్ 16 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. దీంతో డెత్ ఓవర్లలో పరుగులు పిండుకోవడంలో విఫలమైన కోల్‌కతా బ్యాటర్లు బౌలర్లకు వికెట్లు అప్పజెప్పి వెనుదిరిగారు. ఫలితంగా కేకేఆర్ 149 పరుగులకు పరిమితమైంది. రాజస్థాన్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ 4 వికెట్లు తీసుకోగా, బౌల్ట్‌కు రెండు వికెట్లు దక్కాయి.

Updated Date - 2023-05-11T21:46:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising