ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2023: టాస్ గెలిచిన కోల్‌కతా.. అందరి దృష్టి రింకూ పైనే!

ABN, First Publish Date - 2023-04-14T19:23:01+05:30

సన్‌రైజర్స్ హైదరాబాద్‌(SRH)తో ఈడెన్ గార్డెన్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కోల్‌కతా: సన్‌రైజర్స్ హైదరాబాద్‌(SRH)తో ఈడెన్ గార్డెన్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఐపీఎల్‌లో ఇది 19వ మ్యాచ్. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB), గుజరాత్ టైటాన్స్(GT) జట్లపై సంచలన విజయాలు నమోదు చేసిన కేకేఆర్ ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది.

అయిడెన్ మార్కరమ్ సారథ్యంలోని హైదరాబాద్ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడి ఒకే ఒక్క విజయం సాధించి పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో ఉంది. కేకేఆర్-హైదరాబాద్ జట్లు చివరిసారి గత సీజన్‌లో పూణెలో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో కేకేఆర్ 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఇప్పటి వరకు ఇరు జట్లు మొత్తంగా 23 మ్యాచుల్లో ముఖాముఖి తలపడ్డాయి. కోల్‌కతా 15 మ్యాచుల్లో విజయం సాధించగా, హైదరాబాద్ 8 గెలుపులతో సరిపెట్టుకుంది.

కోల్‌కతాకు ఇప్పుడు రింకు సింగ్ రూపంలో సత్తా ఉన్న ఆటగాడు లభించాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో ఓడిపోతున్న మ్యాచ్‌ను గెలిపించిన రింకు సింగ్ క్రికెట్ ప్రేమికుల దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లోనూ అందరి దృష్టి ప్రధానంగా అతడిపైనే ఉంది. ఈ మ్యాచ్‌‌లో కోల్‌కతా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా, హైదరాబాద్ జట్టులో ఓ మార్పు జరిగింది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో అభిషేక్ శర్మ తుది జట్టులోకి వచ్చాడు.

Updated Date - 2023-04-14T19:23:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising