ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2023: బ్యాట్‌తో డుప్లెసిస్.. బంతితో సిరాజ్.. బెంగళూరు ఖాతాలో మరో విజయం

ABN, First Publish Date - 2023-04-20T19:29:52+05:30

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)తో సొంత మైదానంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొహాలీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)తో సొంత మైదానంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్(PBKS) ఓటమి పాలైంది. దాదాపు చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరికి బెంగళూరు 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ మరో 10 బంతులు మిగిలి ఉండగానే 150 పరుగులకు ఆలౌట్ అయింది.

తొలి బంతి నుంచే పంజాబ్ బ్యాటర్లను వణికించిన బెంగళూరు బౌలర్ సిరాజ్(siraj) తొలి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ అథర్వ టైడె (4)ను పెవిలియన్ పంపి దెబ్బ కొట్టాడు. ఇక అప్పుడు మొదలైన వికెట్ల పతనం చివరి వరకు కొనసాగింది. నాలుగు వికెట్లు తీసిన సిరాజ్ పంజాబ్ ఓటమికి కారణమయ్యాడు.

చివర్లో జితేశ్ శర్మ(Jitesh Sharma) ప్రత్యర్థి శిబిరంలో కాసేపు కలవరం రేపాడు. 27 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 పరుగులు చేసిన జితేశ్‌ను హర్షల్ పటేల్ వెనక్కి పంపడంతో బెంగళూరు ఊపిరి పీల్చుకుంది. ఇక, పంజాబ్‌ జట్టులో ప్రభ్‌సిమ్రన్ సింగ్ చేసిన 46 పరుగులే అత్యధికం. ఆ తర్వాత జితేశ్ శర్మ చేసిన 41 పరుగులు తప్ప మిగతా ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. ఫలితంగా 18.2 ఓవర్లలోనే పంజాబ్ ఆలౌట్ అయింది. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ 4, హసరంగ రెండు వికెట్లు తీసుకున్నారు.

అంతకుముందు బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. స్టాండిన్ కెప్టెన్ కోహ్లీ 59, డుప్లెసిస్ 84 పరుగులు చేశారు.

Updated Date - 2023-04-20T19:29:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising