ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2023: వరుస ఓటముల హైదరాబాద్‌కు మరో భారీ షాక్!

ABN, First Publish Date - 2023-04-27T15:07:59+05:30

వరుస ఓటములతో సతమతమవుతున్న సన్‌ రైజర్స్ హైదరాబాద్ (Sun Risers Hyderabad) జట్టుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వరుస ఓటములతో సతమతమవుతున్న సన్‌ రైజర్స్ హైదరాబాద్ (Sun Risers Hyderabad) జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. తొడకండరాల గాయం కారణంగా ఆ జట్టు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sunder) ఐపీఎల్ (IPL 2023) సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. ఈ సీజన్‌లో అంతగా రాణించలేకపోయిన సుందర్.. ఢిల్లీతో మ్యాచ్‌లో మాత్రం అటు బౌలింగులోను, ఇటు బ్యాటింగులోనూ రాణించాడు.

ఆ మ్యాచ్‌లో సుందర్ నాలుగు ఓవర్లు వేసి 28 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. ఇందులో డేవిడ్ వార్నర్ వంటి బిగ్ వికెట్‌తోపాటు సర్ఫరాజ్ ఖాన్, అమన్ ఖాన్ కూడా అతడి బాధితులుగా మారారు. ఆ తర్వాత బ్యాటింగులోనూ సత్తా చాటాడు. 15 బంతుల్లో 24 పరుగులు చేశాడు. ఇందులో మూడు బౌండరీలు ఉన్నాయి.

ఇప్పుడు గాయం కారణంగా ఐపీఎల్ మిగతా మ్యాచ్‌లకు పూర్తిగా దూరమయ్యాడు. ఈ మేరకు హైదరాబాద్ యాజమాన్యం ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఇప్పటి వరకు సుందర్ ఏడు మ్యాచ్‌లు ఆడి 60 పరుగులు చేశాడు. మూడు వికెట్లు తీసుకున్నాడు.

Updated Date - 2023-04-27T15:07:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising