ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

SRH vs KKR: డెత్ ఓవర్లలో పట్టుబిగించిన హైదరాబాద్.. కోల్‌కతా భారీ స్కోరుకు అడ్డుకట్ట

ABN, First Publish Date - 2023-05-04T21:25:39+05:30

డెత్ ఓవర్లలో పూర్తిగా బౌలర్ల ఆధిపత్యం కొనసాగడంతో హైదరాబాద్‌ (SRH)తో జరుగుతున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: డెత్ ఓవర్లలో పూర్తిగా బౌలర్ల ఆధిపత్యం కొనసాగడంతో హైదరాబాద్‌ (SRH)తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా (KKR) ఓ మోస్తరు స్కోరుకు పరిమితమైంది. చివరల్లో వికెట్లను టపటపా నేలకూల్చిన సన్‌రైజర్స్ బౌలర్లు ఒత్తిడి పెంచడంలో సఫలమయ్యారు. ఫలితంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు మాత్రమే చేయగలిగింది.

35 పరుగులకే రహమానుల్లా గుర్జాబ్ (0), వెంకటేశ్ అయ్యర్ (7), జాసన్ రాయ్ (20) అవుటై కష్టాల్లో పడిన జట్టును కెప్టెన్ నితీశ్ రాణా, రింకు సింగ్ ఆదుకున్నారు. తొలుత క్రీజులో కుదురుకునేందుకు నిదానంగా ఆడిన వీరిద్దరూ ఆ తర్వాత అవకాశం చిక్కినప్పుడల్లా బంతులను బౌండరీలకు తరలించి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు.

జట్టు భారీ స్కోరు దిశగా దూసుకెళ్తున్న వేళ నితీశ్ రాణా అవుటయ్యాడు. 31 బంతులు ఆడి 3 ఫోర్లు, 3 సిక్సర్లతో రాణా 42 పరుగులు చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అండీ రసెల్ మెరుపులు మెరిపిస్తాడనుకుంటే ఎప్పటిలానే ఉసూరుమనిపించాడు. 15 బంతులు ఆడి ఫోర్, 2 సిక్సర్లతో 24 పరుగులు చేసి అవుటయ్యాడు.

ఇక, ఆ తర్వాత వచ్చిన వారందరూ క్రీజులోకి వచ్చిందే ఆలస్యమన్నట్టుగా పెవిలియన్ చేరారు. ఫలితంగా భారీ స్కోరు సాధిస్తుందనుకున్న కోల్‌కతా 171 పరుగులకు పరిమితమైంది. రింకు సింగ్ 35 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 46 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనుకుల్ రాయ్ 13 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. హైదరాబాద్ బౌలర్లలో మార్కో జాన్సన్, టి.నటరాజన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

Updated Date - 2023-05-04T21:25:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising