ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2023: ఓవరైనా పూర్తికాకముందే, ఖాతా కూడా తెరవకముందే హైదరాబాద్‌కు భారీ షాక్

ABN, First Publish Date - 2023-04-02T17:51:40+05:30

రాజస్థాన్ రాయల్స్(RR) నిర్దేశించిన 204 పరుగులు భారీ లక్ష్యంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: రాజస్థాన్ రాయల్స్(RR) నిర్దేశించిన 204 పరుగులు భారీ లక్ష్యంతో బ్యాటంగ్ ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌(SRH)కు తొలి ఓవర్‌లోనే ఊహించని షాక్ తగిలింది. ఖాతా కూడా తెరవకముందే రెండు వికెట్లను కోల్పోయింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన తొలి ఓవర్ మూడో బంతికి అభిషేక్ శర్మ డకౌట్ కాగా, ఆ తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి రెండు బంతులు ఆడి ఐదో బంతికి పెవిలియన్ చేరాడు. ఓవర్ కూడా ముగియకుముందే రెండు కీలక వికెట్లు కోల్పోవడంతో స్టేడియం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది.

అంతకుముందు రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు సాధించింది. వరుసగా ముగ్గురు బ్యాటర్లు యశస్వి జైస్వాల్ (54), జోస్ బట్లర్ (54), కెప్టెన్ సంజు శాంసన్ (55) అర్ధ సెంచరీలు బాదారు. కాగా, ప్రస్తుతం 2 ఓవర్లు ముగిశాయి. హైదరాబాద్ రెండు వికెట్ల నష్టానికి 7 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్, హారీ బ్రూక్ క్రీజులో ఉన్నారు.

Updated Date - 2023-04-02T17:51:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising