Andre Russell: కేకేఆర్‌ను పొగిడేస్తూ.. సొంత క్రికెట్ బోర్డుపై సంచలన వ్యాఖ్యలు!

ABN, First Publish Date - 2023-04-29T16:40:29+05:30

కోల్‌కతా నైట్‌రైడర్స్‌(KKR)కు ఈ సీజన్ అంతగా కలిసి రావడం లేదు. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన

Andre Russell: కేకేఆర్‌ను పొగిడేస్తూ.. సొంత క్రికెట్ బోర్డుపై సంచలన వ్యాఖ్యలు!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: కోల్‌కతా నైట్‌రైడర్స్‌(KKR)కు ఈ సీజన్ అంతగా కలిసి రావడం లేదు. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న ఆండ్రె రసెల్(Andre Russell) ఈ సీజన్‌లో పెద్దగా రాణించింది లేదు. ఈ విండీస్ ఆల్‌రౌండర్ 2014 నుంచి కోల్‌కతాకు ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన రసెల్ 108 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగులో ఐదు వికెట్లు తీసుకున్నాడు. రసెల్ తాజాగా తన క్రికెట్ కెరియర్‌లో కేకేఆర్ పాత్రపై మాట్లాడాడు.

కేకేఆర్ ఫ్రాంచైజీ నిజంగా తన కోసం ఎంతో చేసిందని రసెల్ చెప్పుకొచ్చాడు. మోకాలికి గాయమైతే సరైన వైద్యం అందేలా చేసిందన్నాడు. నిజం చెప్పాలంటే అది తనకు ఎంతో స్పెషల్ అన్నాడు. నిజానికి మరే ఇతర ఫ్రాంచైజీ కూడా, ఇంకా చెప్పాలంటే తన సొంత దేశం కూడా తనపై ఇంతలా శ్రద్ధ చూపలేదని, తనపై ఇంత పెట్టుబడి పెట్టలేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. కేకేఆర్ యూట్యూబ్ చానల్‌లో మాట్లాడుతూ రసెల్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

‘‘నేనిక్కడ చాలా ఆనందంగా ఉన్నాను. నేను 9 ఏళ్ల నుంచీ ఇదే ఫ్రాంచైజీకి ఆడుతున్నాను. కాబట్టి మరే ఇతర ఫ్రాంచైజీ వైపు చూడలేదు. చాలా ఏళ్ల నుంచి ఆడుతుండడం, కుర్రాళ్లను కలుస్తున్నాను. ప్రతి సంవత్సరం వారికి మరింత దగ్గరవుతున్నాను. క్రికెట్ ఆడనప్పుడు వెంకీ (మైసూరు)తో మాట్లాడుతూ ఉంటాను. అతడంటే నాకెంతో గౌరవం’’ అని ఈ ఆల్‌రౌండర్ వివరించాడు.

Updated Date - 2023-04-29T16:40:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising