ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2023: బెంగళూరుతో మ్యాచ్.. గత పరాభవాల నుంచి ముంబై బయటపడేనా?

ABN, First Publish Date - 2023-04-02T18:28:20+05:30

ఐపీఎల్‌(IPL 2023)లో మరికాసేపట్లో రెండు బలమైన జట్లు తలపడబోతున్నాయి. అందులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బెంగళూరు: ఐపీఎల్‌(IPL 2023)లో మరికాసేపట్లో రెండు బలమైన జట్లు తలపడబోతున్నాయి. అందులో ఒకటి ముంబై ఇండియన్స్(MI) అయితే, రెండోది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB). నిజానికి ఈ ఐపీఎల్‌లో ప్రధానంగా అందరి దృష్టి ముంబై పైనే ఉంది. గత సీజన్‌లో పేలవ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్‌కు కూడా చేరలేకపోయిన ముంబై వరుసపెట్టి మ్యాచ్‌లను ఓడిపోయి అందరినీ నిరాశ పరిచింది. ఒక్క గెలుపు కోసం అర్రులు చాచింది. ఐదుసార్లు చాంపియన్ ముంబై గత సీజన్‌ను అట్టడుగు స్థానంతో ముగించింది. ఈ నేపథ్యంలో ఈసారి పుంజుకోవాలని, గత పరాభవాలకు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది.

ఈ నేపథ్యంలో మరికాసేపట్లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌ కోసం క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత పరాభవాలను మర్చిపోయి ఈసారి కూడా టైటిల్ వేట సాగించాలని ముంబై కోరుకుంటోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, పేసర్ జోఫ్రో అర్చర్ ఫిట్‌గా ఉన్నట్టు కోచ్ మార్క్ బౌచర్ ప్రకటించారు. ఆ జట్టుకు ఇది కొంత ఊరటనిచ్చే అంశమే. అయితే, జస్ప్రీత్ బుమ్రా, జే రిచర్డ్‌సన్ మాత్రం జట్టుకు దూరమయ్యారు.

నేటి మ్యాచ్‌లో రోహిత్ శర్మ-ఇషాన్ కిషన్ బ్యాటింగును ప్రారంభించే అవకాశం ఉంది. గతంలోనూ వీరిద్దరూ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. భారత జట్టు తరపున కూడా వీరిద్దరూ బ్యాటింగ్ ప్రారంభించారు. ఇటీవల డబుల్ సెంచరీ సాధించినప్పటికీ తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం కిషన్‌పై ఉంది.

బ్యాటింగ్ విభాగంలో సౌతాఫ్రికా యువ ఆటగాడు డేవాల్డ్ బ్రెవిస్, అనుభవజ్ఞుడైన సూర్యకుమార్ యాదవ్ ఉండడం ముంబైకి కొండంత బలంగా చెప్పుకోవచ్చు. గత సీజన్‌లోనూ బ్రెవిస్ మంచి ఫామ్‌తో ఆకట్టుకున్నాడు. మిడిలార్డర్‌లో తిలక్ వర్మ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇక, కేమరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్ బ్యాటింగ్ లైనప్‌కు అదనపు బలం.

బౌలింగు విభాగంలో జోఫ్రా అర్చర్ ముంబైకి ప్రధాన బలం. అతడికి హృతిక్ షోకీన్, సందీప్ వారియర్ జత కలిసే అవకాశం ఉంది. పీయూష్ చావ్లాను ఏకైక స్పిన్నర్‌గా బరిలోకి దించే అవకాశం ఉంది.

ముంబై జట్టు అంచనా: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, కేమరాన్ గ్రీన్, జోఫ్రా అర్చర్, హృతిక్ షోకీన్, సందీప్ వారియర్, పీయూష్ చావ్లా.

Updated Date - 2023-04-02T18:35:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising