Kane Willamson: అయ్యో.. కేన్ ఏంటి ఇలా.. కన్నీరు పెడుతున్న అభిమానులు.. వీడియో వైరల్!

ABN, First Publish Date - 2023-04-04T21:19:51+05:30

న్యూజిలాండ్ ఏస్ బ్యాటర్, గుజరాత్ ఆటగాడు కేన్ విలియమ్సన్(Kane Willamson) చేతి కర్రల ఊతంతో నడుస్తున్న వీడియో ఒకటి సోషల్

Kane Willamson: అయ్యో.. కేన్ ఏంటి ఇలా.. కన్నీరు పెడుతున్న అభిమానులు.. వీడియో వైరల్!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: న్యూజిలాండ్ ఏస్ బ్యాటర్, గుజరాత్ ఆటగాడు కేన్ విలియమ్సన్(Kane Willamson) చేతి కర్రల ఊతంతో నడుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాకెక్కి వైరల్ అవుతోంది. చెన్నై సూపర్ కింగ్స్‌(CSK)తో జరిగిన ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో విలియమ్సన్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) కొట్టిన భారీ షాట్‌ను ఆపేందుకు యత్నించిన కేన్.. బౌండరీ లైన్ వద్ద గాల్లోకి డైవ్ చేశాడు. కిందపడే సమయంలో కుడి మోకాలికి గాయమైంది.

గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఐపీఎల్‌(IPL 2023)కు దూరమైన విలియమ్సన్ స్వదేశానికి చేరుకున్నాడు. ఆక్లాండ్ విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న కేన్.. రెండు ఊతకర్రల సాయంతో బయటకు రావడం చూసి అందరూ షాకయ్యారు. కుడి కాలికి కింది నుంచి పై వరకు కాలికి పెద్ద కట్టు ఉంది. విలియమ్సన్‌ను అలా చూసిన అభిమానులు కంటతడి పెట్టుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

ఈ సందర్భంగా కేన్ మాట్లాడుతూ.. ఇది చాలా దురదృష్ణకరమని, ఐపీఎల్‌లో ఆడింది ఒక్క మ్యాచే అయినా ఎంజాయ్ చేశానని అన్నాడు. గొప్ప జట్టుతో భాగమైనందుకు ఆనందంగా ఉందన్నాడు. గుజరాత్ టైటాన్స్ జట్టు డైరెక్టర్ విక్రం సోలంకి మాట్లాడుతూ.. విలియమ్సన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Updated Date - 2023-04-04T21:19:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising