ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shoaib Malik-Sania Mirza: సానియా మీర్జాతో విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చేసిన షోయబ్!

ABN, First Publish Date - 2023-04-24T21:56:39+05:30

సానియా మీర్జా (Sania Mirza)-షోయబ్ మాలిక్ (Shoaib Malik) మధ్య విభేదాలు పొడసూపాయని,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సానియా మీర్జా (Sania Mirza)-షోయబ్ మాలిక్ (Shoaib Malik) మధ్య విభేదాలు పొడసూపాయని, వారిద్దరూ విడిపోబోతున్నారని, ఇప్పటికే విడాకులకు దరఖాస్తు చేసుకున్నారన్న వార్తలు ఇటీవల వైరల్ అయ్యాయి. ఈ పుకార్లు చెలరేగిపోతున్నా ఇప్పటి వరకు షోయబ్ ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు. తాజాగా పాకిస్థాన్ ‘జియో న్యూస్’తో షోయబ్ మాట్లాడుతూ ఈ పుకార్లపై క్లారిటీ ఇచ్చాడు.

ఈ రూమర్లపై మీరేమంటారన్న ప్రశ్నకు షోయబ్ బదులిస్తూ.. ఇందులో చెప్పడానికేం లేదన్నాడు. ‘ఈద్’ వేళ ఇద్దరం కలిసి ఉంటే ఎంతో గొప్పగా ఉండేదని, అయితే ఐపీఎల్‌లో కమిట్‌మెంట్స్ వల్ల సానియా రాలేకపోయిందని అన్నాడు. అందుకనే తాము కలిసి లేమన్నాడు. అయితే, తాము ఎల్లప్పుడూ ప్రేమను పంచుకుంటూ ఉంటామని చెప్పుకొచ్చాడు.

ఆమెను తాను చాలా మిస్ అవుతున్నానని, తాను చెప్పాలనుకున్నది ఇదేనని షోయబ్ కుండబద్దలుగొట్టాడు. ఇలాంటి రూమర్లను తాము పట్టించుకోబోమని అందుకనే తాను కానీ, ఆమె (సానియా) కానీ ఎలాంటి ప్రకటన చేయలేదన్నాడు. కాగా, సానియా-షోయబ్ దంపతులకు ఇహాన్ మీర్జా మాలిక్ అనే కుమారుడు ఉన్నాడు.

Updated Date - 2023-04-24T21:56:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising