CSKvsSRH: పాపం.. రుతురాజ్ గైక్వాడ్ బ్యాడ్‌లక్.. మంచి స్వింగ్‌లో ఉండగా ఎలా అవుటయ్యాడో చూడండి..
ABN, First Publish Date - 2023-04-22T11:56:16+05:30
చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఈ ఏడాది ఐపీఎల్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. చెన్నై టీమ్‌లో కీలక బ్యాట్స్‌మెన్‌గా మారాడు. మరో ఓపెనర్ కాన్వేతో కలిసి మెరుపు ఆరంభాలను అందిస్తున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) ఈ ఏడాది ఐపీఎల్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. చెన్నై టీమ్‌లో కీలక బ్యాట్స్‌మెన్‌గా మారాడు. మరో ఓపెనర్ కాన్వేతో (Devon Conway) కలిసి మెరుపు ఆరంభాలను అందిస్తున్నాడు. శుక్రవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో (SRH) జరిగిన మ్యాచ్‌లో కూడా ఈ ఓపెనింగ్ జంట అదరగొట్టింది. ఇద్దరూ తొలి వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ దశలో రుతురాజ్ చాలా దురదృష్టకర పద్ధతిలో అవుటయ్యాడు.
135 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై పది ఓవర్ల వరకూ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 87 పరుగులు చేసింది. ఇక, విజయం నల్లేరు మీద నడకే అనుకున్న సమయంలో 11వ ఓవర్లో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. ఉమ్రాన్ మాలిక్ వేసిన 11వ ఓవర్ చివరి బంతికి కాన్వే స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు. ఆ బంతిని మాలిక్ పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి మాలిక్ చేతికి తగిలి నేరుగా వికెట్లకు తాకింది. ఆ సమయానికి రుతురాజ్ క్రీజు బయట ఉన్నాడు.
MS Dhoni: ఇదే నా చివరి ఐపీఎల్ కావొచ్చేమో.. చెన్నైను ఎప్పటికీ మర్చిపోలేను..
అప్పటికే 35 పరుగులు చేసి మంచి టచ్‌లో కనిపించిన రుతురాజ్ దురదృష్టవశాత్తూ రన్ అవుట్ అయ్యాడు. రుతురాజ్ అవుటయ్యాక చెన్నై కాస్త తడబడింది. సన్‌రైజర్స్ లెగ్‌స్పిన్నర్ మార్కండే వరుస ఓవర్లలో రహానె (9), ఇంపాక్ట్ ప్లేయర్ అంబటి రాయుడు (9)ను అవుట్ చేయడంతో చెన్నై కొద్దిగా ఒత్తిడికి లోనైంది. అయితే ఓపెనర్ కాన్వే వరుసగా బౌండరీలు బాది చెన్నై టీమ్‌కు విజయాన్ని ఖరారు చేశాడు.
Updated Date - 2023-04-22T12:12:04+05:30 IST