IPL 2023: ఫ్రీ-హిట్‌కు రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేసిన డేవిడ్ వార్నర్.. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి..
ABN, First Publish Date - 2023-04-12T14:08:06+05:30
ముంబై ఇండియన్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్, వైస్-కెప్టెన్ అర్ధ సెంచరీలు చేశారు. ఢిల్లీ వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ కేవలం 22 బంతుల్లో 50 పరుగులు సాధించాడు.
ముంబై ఇండియన్స్‌తో (MI) మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ (DC), వైస్-కెప్టెన్ అర్ధ సెంచరీలు చేశారు. ఢిల్లీ వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ (Axar Patel) కేవలం 22 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. అక్షర్‌కు ఐపీఎల్‌లో ఇదే తొలి హాఫ్ సెంచరీ. డీసీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (David Warner) 47 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో వార్నర్‌కు ఇది 58వ అర్ధ సెంచరీ. వీరిద్దరూ రాణించడంతో ఢిల్లీ 172 పరుగులు చేసింది. అయినా టీమ్ మాత్రం విజయం సాధించలేదు. వరుసగా నాలుగోసారి ఓటమి పాలైంది.
వార్నర్ చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేసినందుకు చాలా మంది విమర్శించారు. ఒక ఎండ్‌లో వికెట్లు పడిపోతుండడం వల్లే వార్నర్ నెమ్మదిగా ఆడాల్సి వచ్చిందని మరికొందరు సమర్థిస్తున్నారు. కాగా, వార్నర్ ఇన్నింగ్స్‌లో ఓ విచిత్రమైన అంశం తెరపైకి వచ్చింది. ముంబై బౌలర్ హృతిక్ వేసిన ఎనిమిదో ఓవర్‌లో వార్నర్ ఉన్నట్టుండి రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేశాడు (David Warner Bats Right-handed). ఆ ఓవర్లో హృతిక్ వేసిన బాల్‌ను అంపైర్ నో-బాల్‌గా ప్రకటించాడు. దీంతో ఆ ఫ్రీ-హిట్‌ను ఆడేందుకు వార్నర్ కుడిచేతి వాటం బ్యాటింగ్ చేశాడు. అయితే ఆ బంతిని సరిగ్గా టైమ్ చేయలేకపోవడంతో కేవలం ఒక పరుగు మాత్రమే వచ్చింది.
IPL 2023: 5 బంతుల్లో 5 సిక్స్‌లు.. ఆ మ్యాచ్ తర్వాత యశ్ దయాల్ తల్లి అన్నం తినలేదట, రాత్రంతా ఏడుస్తూనే ఉందట..!
ఈ మ్యాచ్‌లోనూ పరాజయం పాలవడంతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అట్టడుగు స్థానంలోనే కొనసాగుతోంది. తమకు లభిస్తున్న శుభారంభాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నామని వార్నర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇక, ఈ సీజన్‌లో తొలి విజయం సాధించిన ముంబై పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకింది.
Updated Date - 2023-04-12T14:08:06+05:30 IST