MS Dhoni: ఇదే నా చివరి ఐపీఎల్ కావొచ్చేమో.. చెన్నైను ఎప్పటికీ మర్చిపోలేను..
ABN, First Publish Date - 2023-04-22T10:19:33+05:30
మహేంద్ర సింగ్ ధోనీ అంటే కేవలం ఓ క్రికెటర్ మాత్రమే కాదు.. క్రికెట్ అభిమానులకు ఓ ఎమోషన్. భారత్‌కు ఎన్నో మరపురాని విజయాలు అందించిన ఓ గొప్ప నాయకుడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న ధోనీ అంటే తమిళులకు ఎంతో అభిమానం.
మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) అంటే కేవలం ఓ క్రికెటర్ మాత్రమే కాదు.. క్రికెట్ అభిమానులకు ఓ ఎమోషన్. భారత్‌కు ఎన్నో మరపురాని విజయాలు అందించిన ఓ గొప్ప నాయకుడు. ఐపీఎల్‌లో (IPL 2023) చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున ఆడుతున్న ధోనీ అంటే తమిళులకు ఎంతో అభిమానం. ధోనీని తమ సొంత వ్యక్తిలాగానే భావిస్తారు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ ఐపీఎల్ మాత్రం ఆడుతున్నాడు. ఇక, ఇదే ధోనీ చివరి ఐపీఎల్ అని వార్తలు వస్తున్నాయి.
గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో (SRH) జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన అనంతరం ధోనీ మాట్లాడాడు. ``నాకు వయసు పెరుగుతోంది. అందులో దాచాల్సిందేమీ లేదు. ప్రస్తుతం నేను నా కెరీర్ చివరి దశలో ఉన్నాను. ప్రస్తుతం ప్రతీ మ్యాచ్‌ను ఆస్వాదించడానికి ప్రయత్నిస్తున్నాను. నాకు చెన్నైతో (Chennai) విడదీయరాని బంధం ఉంది. ఇక్కడి ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ప్రేమను, అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. దాదాపు రెండేళ్ల తర్వాత చెన్నైలో ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుత సీజన్‌లో మా జట్టు అద్భుతంగా రాణిస్తోంది.
IPL 2023: స్టంప్స్ వెనకాల సూపర్ మ్యాన్ ధోనీ అద్భుత ప్రదర్శన.. వేరెవరకీ సాధ్యం కాని రికార్డు సొంతం చేసుకున్న మహీ!
ముఖ్యంగా యువ బౌలర్లు రాణించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా పతిరన (Matheesha Pathirana) బౌలింగ్ యాక్షన్ అద్భుతంగా ఉంది. అలాంటి బౌలింగ్ యాక్షన్ ఉన్న బౌలర్‌ను ఎదుర్కోవడం ఎంతటి బ్యాట్స్‌మెన్‌కైనా కష్టమేన``ని ధోనీ పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన చెన్నై 4 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.
Updated Date - 2023-04-22T10:19:33+05:30 IST