ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Faf Du Plessis: ఆర్సీబీ గెలవదని ముందే చెప్పిన డుప్లెసిస్.. వైరల్ అవుతున్న పాత వీడియో!

ABN, First Publish Date - 2023-05-23T10:37:08+05:30

ఐపీఎల్ 2023 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ నిష్క్రమించడం చాలా మందికి బాధ కలిగించింది. ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఆ టీమ్ ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేదు. 16 సీజన్లలో కేవలం మూడు సార్లు మాత్రమే ఫైనల్ చేరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐపీఎల్ 2023 (IPL 2023) నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్ నిష్క్రమించడం చాలా మందికి బాధ కలిగించింది. ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఆ టీమ్ ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేదు. 16 సీజన్లలో కేవలం మూడు సార్లు మాత్రమే ఫైనల్ చేరింది. ఈ సారి ఎలాగైనా కప్ సాధించలనే పట్టుదలతో ఆర్సీబీ టీమ్ బరిలోకి దిగింది. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (GTvsRCB) కోహ్లీ (Virat Kohli) సెంచరీ సాధించడంతో తప్పక గెలుస్తుందని అభిమానులు భావించారు. అయితే శుభ్‌మన్ గిల్ (Shubman Gill) సూపర్ సెంచరీతో వారి ఆశలపై నీళ్లు చల్లాడు.

ఈ ఏడాది కూడా టైటిల్ గెలవకుండా ఆర్సీబీ వెనుదిరిగిన నేపథ్యంలో ఆ టీమ్‌కు సంబంధించిన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. ఈ సీజన్ ప్రారంభానికి ముందు బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఆర్సీబీ టీమ్ కెప్టెన్ డుప్లెసిస్ (Faf Du Plessis), ఆటగాడు విరాట్ కోహ్లీ హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో తమ టీమ్ స్లోగన్ అయిన ``ఈ సాల కప్ నమ్డే`` (ఈ సారి కప్ మనదే) అని డుప్లెసి చెప్పాల్సి ఉండగా.. ``ఈ సాల కప్ నహీ`` (ఈ ఏడాది కప్ లేదు) అని చెప్పాడు.

Virat kohli: కోహ్లీ, గిల్ సెంచరీల్లో తేడా అదే.. మాజీ ఆటగాడు టామ్ మూడీ ఆసక్తికర వ్యాఖ్యలు!

పక్కనే ఉన్న కోహ్లీ డుప్లెసి చెప్పిన మాటలను నవ్వుతూ సరి చేశాడు. ఆ తర్వాత కోహ్లీ కొద్ది సేపు నవ్వుకున్నాడు. ఆర్సీబీ ఓడిపోవడంతో ఈ పాత వీడియో ప్రస్తుతం మళ్లీ ట్రెండింగ్‌లోకి (Trending Video) వచ్చింది. ఈ వీడియోను కోహ్లీ ఫ్యాన్స్‌కు ట్యాగ్ చేస్తూ చాలా మంది ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా ఆర్సీబీ టైటిల్ గెలవదని కెప్టెన్ డుప్లెసికి ముందే తెలుసని కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-05-23T10:37:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising