ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Masan Mount: బాప్‌రే.. ఈ ఫుట్‌బాల్ ప్లేయర్ ధర రూ.577 కోట్లు

ABN, First Publish Date - 2023-07-06T19:57:06+05:30

ప్రపంచ వ్యాప్తంగా సాకర్ వరల్డ్ కప్ తర్వాత ఎన్నో లీగ్‌లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రీమియర్ లీగ్ కోసం ప్లేయర్లను కొనుగోలు చేస్తున్నారు. అందులో భాగంగా ఫుట్‌బాల్ స్టార్, మిడ్ ఫీల్డర్ 24 ఏళ్ల మాసన్ మౌంట్ కోసం మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ 55 మిలియన్ పౌండ్లను వెచ్చించింది. 2020-2021, 2021 – 2022 సీజన్‌లలో చెల్సియా క్లబ్ తరపున మానస్ మౌంట్ ప్లేయర్ అఫ్ ది ఇయర్‌గా నిలవడంతో భారీ స్థాయిలో అతడిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మన దేశంలో ఐపీఎల్ ప్లేయర్ రూ.15 కోట్లకు అమ్ముడుపోతే అదో పెద్ద న్యూస్. కానీ ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన ఫుట్‌బాల్ క్రీడకు సంబంధించి ఓ ఇంగ్లీష్ ఆటగాడు ఆశ్చర్యకర రీతిలో రూ.577 కోట్లకు అమ్ముడుపోయాడు. చెల్సియా క్లబ్‌కు చెందిన ఫుట్‌బాల్ స్టార్ మాసన్ మౌంట్‌ను మాంచెస్టర్ యునైటెడ్ టీమ్ రికార్డు స్థాయిలో కొనుగోలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ మేరకు రొనాల్డో జెర్సీ నంబర్ 7ను మాసన్ మౌంట్‌కు మాంచెస్టర్ టీమ్ బహుమతిగా ఇచ్చింది. దీంతో మౌంట్ మాంచెస్టర్ క్లబ్ తరఫున ఏడో నంబర్ జెర్సీతో మాసన్ మౌంట్ బరిలోకి దిగననున్నాడు.

కాగా ప్రపంచ వ్యాప్తంగా సాకర్ వరల్డ్ కప్ తర్వాత ఎన్నో లీగ్‌లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రీమియర్ లీగ్ కోసం ప్లేయర్లను కొనుగోలు చేస్తున్నారు. అందులో భాగంగా ఫుట్‌బాల్ స్టార్, మిడ్ ఫీల్డర్ 24 ఏళ్ల మాసన్ మౌంట్ కోసం మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ 55 మిలియన్ పౌండ్లను వెచ్చించింది. 2020-2021, 2021 – 2022 సీజన్‌లలో చెల్సియా క్లబ్ తరపున మానస్ మౌంట్ ప్లేయర్ అఫ్ ది ఇయర్‌గా నిలవడంతో భారీ స్థాయిలో అతడిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మరి ప్రీమియర్ లీగ్‌లో మాసన్ మౌంట్ ప్రదర్శన ఎలా ఉంటుందో వేచి చూడాలి.

ఇది కూడా చదవండి: మూడు ఫార్మాట్లలో ఎంపికయ్యారు.. కానీ జట్టులో స్థానం లభించేనా?

కాగా మాసన్‌ మౌంట్ చెల్సియాతో తన సీనియర్‌ ఫుట్‌బాల్ క్లబ్ కెరీర్‌ను ప్రారంభించాడు. 2017-19 మధ్య విటెస్సే, డెర్బీ కౌంటీ తరపున ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం చెల్సియాకు తిరిగొచ్చాడు. తాను ఇన్నాళ్లు ఆడిన క్లబ్‌ను విడిచిపెట్టడం అంత సులభం కాదని.. కానీ మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ తనపై నమ్మకంతో భారీస్థాయిలో కొనుగోలు చేసిందని.. ఇది తన కెరీర్‌కు ఎంతో ఉత్తేజం కలిగిస్తుందని.. ఇది తనకు ఓ సవాల్ లాంటిదని మాసన్ మౌంట్ అన్నాడు. తాను ఎంత బలమైన స్క్వాడ్‌లో చేరుతున్నానో తెలుసు అని.. ప్రధాన ట్రోఫీలను గెలిచేందుకు ఇలాంటి టీమ్‌లో భాగం అయ్యేందుకు తాను వేచి చూస్తున్నట్లు పేర్కొన్నాడు.

Updated Date - 2023-07-06T20:05:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising